Malkajgiri: మల్కాజిగిరి సీనియర్ సిటిజన్స్ సంఘం ఎన్నిక!

Malkajgiri: మల్కాజిగిరి-మౌలాలి సీనియర్ సిటిజన్స్ సంఘం అధ్యక్షుడిగా భానుమూర్తి, ప్రధాన కార్యదర్శిగా ఎల్. కిష్టయ్య ఏకగ్రీవ ఎన్నిక. పూర్తి వివరాలు చూడండి.

Bodike Manohar, Malkajgiri
Published on: 25 Aug 2026 6:46 AM IST
Malkajgiri
X

Malkajgiri: మల్కాజిగిరి సీనియర్ సిటిజన్స్ సంఘం ఎన్నిక!

Malkajgiri: తెలంగాణ ఆల్ సీనియర్ సిటిజన్స్ సంఘం మల్కాజిగిరి–మౌలాలి సర్కిల్ నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. నేరేడుమెట్‌లోని అంబేద్కర్ భవన్‌లో ఎన్నికల అధికారి సమక్షంలో ఎన్నికల ప్రక్రియ నిర్వహించారు. రాష్ట్ర అధ్యక్షుడు పి. నర్సింగరావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, జిల్లా అధ్యక్షులు, కమిటీ సభ్యుల పర్యవేక్షణలో నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు.

ఈ సందర్భంగా పి. నర్సింగరావు మాట్లాడుతూ వయోవృద్ధులకు అందాల్సిన ప్రభుత్వ పథకాలు, సంక్షేమ నిధులు నేరుగా చేరేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశారు. సీనియర్ సిటిజన్స్ సంక్షేమం, హక్కుల పరిరక్షణకు నూతన కార్యవర్గం కృషి చేయాలని సూచించారు.

నూతనంగా ఎన్నికైన కార్యవర్గ సభ్యులు మాట్లాడుతూ సీనియర్ సిటిజన్స్ సమస్యల పరిష్కారానికి, వారి హక్కుల సాధనకు నిరంతరం కృషి చేస్తామని తెలిపారు.

నూతన కార్యవర్గం: అధ్యక్షుడిగా భానుమూర్తి, ఉపాధ్యక్షులుగా కే. విజయ్ కుమార్, బి. అశోక్, ప్రధాన కార్యదర్శిగా ఎల్. కిష్టయ్య, సంయుక్త కార్యదర్శిగా జి. శ్రీనివాస్, నిర్వాహకుడిగా కే. బాలస్వామి, కోశాధికారిగా జి.వి.ఎస్. సత్యనారాయణ ఎన్నికయ్యారు. కార్యవర్గ సభ్యులుగా ఆర్.వి. సూరిబాబు, ఏ. మహేశ్వరరావు, పి. రాములు గౌడ్, బి. ఈశ్వర్ గౌడ్, వి.టి. కృష్ణ ఎన్నికయ్యారు.

Bodike Manohar, Malkajgiri

Bodike Manohar, Malkajgiri

Next Story