Secunderabad: సికింద్రాబాద్ మహేంద్రహిల్స్‌లో ఘనంగా శ్రావణ బోనాలు

Secunderabad: సికింద్రాబాద్ మహేంద్రహిల్స్ వన దుర్గా రాజరాజేశ్వరి అమ్మవారి ఆలయంలో ఘనంగా శ్రావణ బోనాల ఉత్సవాలు. ప్రధాన అర్చకులు వేణుమాధవ్ శర్మ ఆధ్వర్యంలో వేడుకలు.

Srikanth, Secunderabad
Published on: 16 Aug 2026 5:06 PM IST
Secunderabad
X

Secunderabad: సికింద్రాబాద్ మహేంద్రహిల్స్‌లో ఘనంగా శ్రావణ బోనాలు

సికింద్రాబాద్: శ్రీ ఉజ్జయిని మహాకాళి అమ్మవారి ఆలయంలో ప్రఖ్యాత ఆధ్యాత్మిక గురువు,ప్రధాన అర్చకుడు వేణు మాధవ్ శర్మ ఆధ్వర్యంలో సికింద్రాబాద్ మహేంద్రహిల్స్ శ్రావణ బోనం ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు.

ప్రతి ఏటా ఆషాఢమాసం మాసం తరువాత వచ్చే శ్రావణ తొలి ఆదివారం రోజున మహేంద్రహిల్స్ లోని వన దుర్గా రాజరాజేశ్వరి అమ్మవారికి ప్రత్యేక బోనం నిర్వహించడం ఆనవాయితీగా వస్తుందని మహంకాళి టెంపుల్ అర్చకులు వేణుమాధవ్ శర్మ తెలిపారు..బోనంతోపాటు జోగిని బోనం ఎత్తుకొని చేసే ఆటలు.

పోతురాజుల విన్యాసాలు భక్తుల తీన్మార్ స్టెప్పులతో మహేంద్రాహిల్స్ విధుల్లో సందడి చేలకొంది.బోనం ఉత్సవానికి వచ్చిన వేలాది మంది భక్తులు అమ్మవారి దర్శనం అనంతరం వెజ్,నాన్ వెజ్ వంటకాలతో అన్నప్రసాదం పెట్టడం సంప్రదాయంగా వస్తుందని వేణుమాధవ్ శర్మ తెలిపారు.

Srikanth, Secunderabad

Srikanth, Secunderabad

Next Story