Malkajgiri: మల్కాజ్‌గిరి జోనల్ కార్యాలయంలో ఘనంగా బోనాల ఉత్సవాలు
Malkajgiri: సికింద్రాబాద్ మల్కాజ్‌గిరి జోనల్ కమిషనర్ కార్యాలయంలో మహంకాళి బోనాల ఉత్సవాలు. పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించిన కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్.
Malkajgiri: మల్కాజ్‌గిరి జోనల్ కార్యాలయంలో ఘనంగా బోనాల ఉత్సవాలు
మల్కాజ్ గిరి: భాగ్యనగర్ మున్సిపల్ ఎంప్లాయిస్ యూనియన్ ఆధ్వర్యంలో సికింద్రాబాద్ మారేడ్‌పల్లిలోని మల్కాజ్ గిరి జోనల్ కమిషనర్ కార్యాలయ ఆవరణలో ఉన్న శ్రీ దుర్గా ఎల్లమ్మ దేవస్థానంలో మహంకాళి బోనాల ఉత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించారు.
ఈ వేడుకల్లో కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారి ఆశీస్సులతో నియోజకవర్గ ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఉండాలని కోరుకున్నట్టు తెలిపారు.
ప్రతి సంవత్సరం ఎంప్లాయిస్ యూనియన్ ఆధ్వర్యంలో భక్తిశ్రద్ధలతో ఈ బోనాల ఉత్సవాలను నిర్వహిస్తున్నామని యూనియన్ ప్రెసిడెంట్ శ్యామ్ రావు మరియు వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రకాశ్ తెలిపారు.
ఈ కార్యక్రమంలో భాగ్యనగర్ మున్సిపల్ ఎంప్లాయిస్ యూనియన్ నాయకులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు సిబ్బంది మరియు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.




