Secunderabad: బోయిన్‌పల్లిలో బీఆర్‌ఎస్ భారీ నిరసన!
Secunderabad: కాంగ్రెస్ ప్రభుత్వ 6 గ్యారంటీలు, 420 హామీల వైఫల్యంపై ఓల్డ్ బోయిన్‌పల్లిలో బీఆర్‌ఎస్ నిరసన.
Secunderabad: బోయిన్‌పల్లిలో బీఆర్‌ఎస్ భారీ నిరసన!
Secunderabad: కాంగ్రెస్ ప్రభుత్వ 6 గ్యారంటీలు – 420 హామీల అమలులో వైఫల్యాన్ని నిరసిస్తూ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఓల్డ్ బోయిన్‌పల్లి భాగ్యశ్రీ గార్డెన్స్‌లో భారీ నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ ముద్దం నర్సింహ యాదవ్ పాల్గొని మాట్లాడారు.
ఈ సందర్భంగా ముద్దం నర్సింహ యాదవ్ మాట్లాడుతూ… 2009 నుంచి బోయిన్‌పల్లిలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి నాటి బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎమ్మెల్యే తో కలిసి నిరంతరం కృషి చేశామని తెలిపారు.
2014 నుంచి 2023 వరకు బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలకు అనేక సంక్షేమ పథకాలను సమగ్రంగా అందించిందన్నారు.ముఖ్యంగా కేసీఆర్ ఆడబిడ్డలకు పెద్దన్నగా నిలిచి కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ వంటి గొప్ప సంక్షేమ పథకాలను అందించారని, దేశంలో మరే రాష్ట్రంలో లేని అనేక సంక్షేమ కార్యక్రమాలను తెలంగాణ ప్రజలకు అందించిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానిదేనని పేర్కొన్నారు.
బోయిన్‌పల్లిలో డ్రైనేజీ, పారిశుద్ధ్యం, విద్యుత్ తదితర మౌలిక వసతుల సమస్యల పరిష్కారానికి బీఆర్ఎస్ హయాంలో ప్రాధాన్యత ఇచ్చామని తెలిపారు.




