Secunderabad: యశోద ఆస్పత్రిలో పెద్ది సుదర్శన్‌రెడ్డిని పరామర్శించిన KCR

Secunderabad: సికింద్రాబాద్ యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డిని పరామర్శించిన KCR. ఆరోగ్య పరిస్థితిపై డాక్టర్లతో సమీక్ష.

Srikanth, Secunderabad
Published on: 27 July 2026 11:52 PM IST
Secunderabad
X

Secunderabad: యశోద ఆస్పత్రిలో పెద్ది సుదర్శన్‌రెడ్డిని పరామర్శించిన KCR

సికింద్రాబాద్: నిమోనియతో లన్ ఇన్ఫెక్షన్..హార్ట్ సంబంధిత ప్రాబ్లమ్స్ కారణంగా సికింద్రాబాద్ యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఉద్యమ నాయకుడు,నర్సం పేట బి ఆర్ ఎస్ మాజీ ఏం ఎల్ ఏ పెద్ది సుదర్శన్ రెడ్డిని మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ పరామర్శించారు.

కెసిఆర్ వెంట బి ఆర్ ఎస్ మాజీ మంత్రులు హరీశ్ రావు..తలసాని శ్రీనివాస్ యాదవ్..శ్రీనివాస్ గౌడ్..పద్మారావు గౌడ్..వేముల ప్రశాంత్ రెడ్డి..జనగాం ఏం ఎల్ ఏ పల్లా రాజేశ్వర్ రెడ్డి తోపాటు బి ఆర్ ఎస్ ముఖ్యనేతలు ఉన్నారు..చికిత్స పొందుతున్న పెద్ది సుదర్శన్ ఆరోగ్య పరిస్థితిని ఆసుపత్రి వైద్యులను అడిగి తెలుసుకున్నారు.

కెసీఆర్..మరింత మెరుగైన వైద్యం అందించాలని కెసిఆర్ డాక్టర్లను కోరారు..పెద్ది సుదర్శన్ రెడ్డి ని పరామర్శించిన కెసిఆర్ ఆయన కుటుంబ సభ్యులను కలిసి ధైర్యం చెప్పారు.

కెసిఆర్ యశోద ఆసుపత్రికి వస్తున్నారన్న సమాచారంతో ఆయనన్ను చూడడానికి పెద్ద సంఖ్యలో బి ఆర్ ఎస్ నాయకులు,కార్యక్తలు,అభిమానుల తోపాటు ఆస్పత్రికి వచ్చిన పబ్లిక్ చూడడానికి,సెల్ఫీలు తీయడానికి ఎగబడడంతో పోలీసులు కంట్రోల్ చేశారు..అనంతరం తిరిగి కెసీఆర్ ఎర్రవల్లి ఫామ్ హౌజ్ కు వెళ్లిపోయారు.

Srikanth, Secunderabad

Srikanth, Secunderabad

Next Story