Secunderabad: స్వీకార్ సంస్థ సేవలు అభినందనీయం గవర్నర్ శివ ప్రతాప్ శుక్ల
Secunderabad: స్వీకార్ రిహాబిలిటేషన్ సెంటర్ గోల్డెన్ జూబ్లీ వేడుకల్లో పాల్గొన్న గవర్నర్ శివ ప్రతాప్ శుక్ల. మానసిక వికలాంగులకు సంస్థ చేస్తున్న సేవలకు ప్రశంస.
Secunderabad: స్వీకార్ సంస్థ సేవలు అభినందనీయం గవర్నర్ శివ ప్రతాప్ శుక్ల
సికింద్రాబాద్: డప్ అండ్ డమ్ మానసిక వికలాంగులకు సేవ చేస్తున్న స్వీకార్ మల్టీ స్పెషాలిటీ రియాబిలిషన్ సెంటర్ ఫాండర్ చైర్మెన్ హనుమంతు రావు చేస్తున్న సేవలు అభినందనీయమని తెలంగాణ రాష్ట్ర గవర్నవర్ శివ ప్రతాప్ శుక్ల అన్నారు.
సికింద్రాబాద్ జేబీఎస్ సమీపంలో ఉన్న స్వీకార్ మల్టీ స్పెషాలిటీ రియాబిలిషన్ సెంటర్ యాభై సంవత్సరాలు పూర్తి చేసుకొని గోల్డెన్ జూబ్లీ వేడుకలు జరుపుకుంటున్న సందర్భంగా ముఖ్య అతిథిగా గవర్నర్ శివ ప్రతాప్ శుక్ల హాజరయ్యారు.
మంచిగా ఉండే వారికి శిక్షణ,వైద్యం చేయవచ్చు కాని మానసిక వికలాంగులకు వైద్యం శిక్షణ ఇవ్వడం శ్రమతో కూడుకున్న విషయమని గవర్నర్ పేర్కొన్నారు.
తన వంతు కూడా ఆర్ధిక సహాయం తోపాటు గవర్నమెంట్ తో మాట్లాడి కావాల్సి నిధులు వచ్చేలా ప్రయత్నం చేస్తానని గవర్నర్ శుక్ల హామీ ఇచ్చారు.




