Secunderabad: కాంగ్రెస్ ప్రభుత్వంపై కంటోన్మెంట్ బీఆర్ఎస్ మహిళల నిరసన

Secunderabad: సికింద్రాబాద్ కంటోన్మెంట్‌లో బీఆర్ఎస్ మహిళల సదస్సు నిర్వహించారు.

Srikanth, Secunderabad
Published on: 4 Sept 2026 10:49 PM IST
Secunderabad
X

Secunderabad: కాంగ్రెస్ ప్రభుత్వంపై కంటోన్మెంట్ బీఆర్ఎస్ మహిళల నిరసన

సికింద్రాబాద్: మహిళలకు ఎన్నో హామీలు ఇచ్చి మహిళల ఓట్లతో గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలను మోసం చేసిందని కంటోన్మెంట్ బిఆర్ఎస్ ఇంచార్జ్ నివేదిత సాయన్న, మన్నే కృశాంక్, గజ్జల నాగేష్ లు అన్నారు. వెయ్యి రోజుల కాంగ్రెస్ పాలనపై వ్యతిరేక నిరసనల్లో భాగంగా కంటోన్మెంట్ లో మహిళల సదస్సును నిర్వహించారు.

మహాలక్ష్మి పథకం కింద 2500, వృద్ధులకు ఒంటరి మహిళలకు 4000 రూపాయలు, ఇవ్వలేదని ఆమె అన్నారు. చదువుకునే కాలేజీ విద్యార్థులకు స్కూటీలు ఇస్తాన ప్రభుత్వము ఒక్క హామీ ఇచ్చి మహిళలను మోసం చేసింది తప్ప మహిళల కోసం ఏమి చేయలేదని ఆమె దుయ్యబడ్డారు. మహిళల సమస్యలపై ప్రజల పక్షాన తాము గుంతెత్తడానికి సిద్ధంగా ఉన్నామని నివేదిత సాయన్న తెలిపారు.

Srikanth, Secunderabad

Srikanth, Secunderabad

Next Story