Secunderabad: ఎమ్మెల్యేల సస్పెన్షన్‌పై భగ్గుమన్న గులాబీ శ్రేణులు!

Secunderabad: అసెంబ్లీలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల సస్పెన్షన్‌ను నిరసిస్తూ ఓల్డ్ బోయిన్‌పల్లిలో మాజీ కార్పొరేటర్ ముద్దం నర్సింహ యాదవ్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.

Srikanth, Secunderabad
Published on: 10 Sept 2026 9:12 AM IST
Secunderabad
X

Secunderabad: ఎమ్మెల్యేల సస్పెన్షన్‌పై భగ్గుమన్న గులాబీ శ్రేణులు!

Secunderabad: ఓల్డ్ బోయిన్‌పల్లి..తెలంగాణ అసెంబ్లీ నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను అసెంబ్లీ సెషన్ మొత్తం సస్పెండ్ చేయడాన్ని నిరసిస్తూ ఓల్డ్ బోయిన్‌పల్లిలో బీఆర్ఎస్ నాయకులు ధర్నా నిర్వహించారు. ఓల్డ్ బోయిన్‌పల్లి మాజీ కార్పొరేటర్ ముద్దం నర్సింహ యాదవ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ నిరసన కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, మహిళా నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ముద్దం నర్సింహ యాదవ్ మాట్లాడుతూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు సహా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను అసెంబ్లీ సెషన్ మొత్తం సస్పెండ్ చేయడం అప్రజాస్వామిక చర్య అని తీవ్రంగా ఖండించారు.

ప్రజా సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావిస్తూ.. ప్రజల తరఫున ప్రశ్నిస్తున్న ప్రతిపక్ష ఎమ్మెల్యేల గొంతును అణిచివేయడం ద్వారా ప్రభుత్వం ప్రజాస్వామ్య విలువలను కాలరాస్తోందని ఆయన ఆరోపించారు.

కేటీఆర్, మాధవరం కృష్ణారావు ప్రజా సమస్యలపై చేస్తున్న పోరాటానికి బీఆర్ఎస్ శ్రేణులు అండగా నిలుస్తాయని ముద్దం నర్సింహ యాదవ్ స్పష్టం చేశారు. ఎమ్మెల్యేలను సస్పెండ్ చేయగలరు కానీ ప్రజల గొంతును సస్పెండ్ చేయలేరు. ప్రజల కోసం మా పోరాటం ఆగదు అని ఆయన అన్నారు. బీఆర్

Srikanth, Secunderabad

Srikanth, Secunderabad

Next Story