Miyapur: నాలాలో గల్లంతైన వ్యక్తి. ఎన్డీఆర్‌ఎఫ్, హైడ్రా గాలింపు చర్యలు!
Miyapur: మియాపూర్ నాలా వరద నీటిలో గల్లంతైన బాలయ్య కోసం ఎన్డీఆర్‌ఎఫ్, హైడ్రా బృందాల గాలింపు కొనసాగుతోంది. సమాచారం తెలియక కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు.
Miyapur: నాలాలో గల్లంతైన వ్యక్తి. ఎన్డీఆర్‌ఎఫ్, హైడ్రా గాలింపు చర్యలు!
మియాపూర్: నాలాలో గల్లంతైన వ్యక్తి కోసం కొనసాగుతున్న గాలింపు.. కుటుంబ సభ్యుల్లో తీవ్ర ఆందోళన*
మియాపూర్ వైశాలి నగర్ సమీపంలోని అండర్ పాస్ వద్ద వరద నీటిలో గల్లంతైన బాలయ్య అనే వ్యక్తి ఆచూకీ ఇంకా లభ్యం కాలేదు. నిన్న అర్ధరాత్రి నుంచి జీహెచ్‌ఎంసీ (GHMC) ఇంజినీరింగ్ అధికారులు మరియు రెస్క్యూ బృందాలు సహాయక చర్యలు చేపట్టినప్పటికీ ఆయన వివరాలు తెలియరాలేదు.
సమాచారం అందుకున్న మియాపూర్ పోలీసులు, హైడ్రా (HYDRAA) మరియు ఎన్డీఆర్ఎఫ్ (NDRF) బృందాలు రంగంలోకి దిగి నాలాలో అధునాతన కెమెరాల సహాయంతో సుదీర్ఘంగా పరిశీలిస్తున్నాయి. నీటి ప్రవాహం ఎక్కువగా ఉండటంతో గాలింపు చర్యలకు అంతరాయం ఏర్పడుతోంది. గంటలు గడుస్తున్నా బాలయ్య ఆచూకీ లభించకపోవడంతో ఆయన కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. అధికారులు సహాయక చర్యలను మరింత వేగవంతం చేశారు.




