Rangareddy: పడకల్ అభివృద్ధిపై ఎమ్మెల్యే కసిరెడ్డికి వినతిపత్రం!
Rangareddy: బూర్గుల జన్మస్థలమైన పడకల్ అభివృద్ధికి నిధులు ఇవ్వాలని ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డిని సర్పంచ్ సునీత కలసి వినతిపత్రం అందించారు.
Rangareddy: పడకల్ అభివృద్ధిపై ఎమ్మెల్యే కసిరెడ్డికి వినతిపత్రం!
Rangareddy: హైదరాబాద్ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావు పుట్టిన పడకల్ గ్రామ అభివృద్ధికి నిధులు కేటాయించండి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి కోరిన పడకల్ గ్రామ సర్పంచ్ డోకురి సునీత ప్రభాకర్ రెడ్డి.రంగా రెడ్డి జిల్లా తలకొండ పల్లి మండలం పడకల్ గ్రామ సర్పంచ్ డోకూరి సునీత ప్రభాకర్ రెడ్డి.
ఈరోజు హైదరాబాద్ లోని ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి స్వగృహంలో కలిసి హైదరాబాద్ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావు పుట్టిన గ్రామం పడకల్ గ్రామంలో రాష్ట్ర ప్రభుత్వం బూర్గుల రామకృష్ణారావు విగ్రహ ఏర్పాటు మరియు ఆడిటోరియం ఏర్పాటు చేయాలని కోరారు .
వారు పుట్టిన గ్రామాన్ని రాష్ట్రంలోనే ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దడానికి అభివృద్ధి పనులు,అండర్ డ్రైనేజ్, సిసి రోడ్లు, వీధిలైట్లు, వెటర్నరీ హాస్పిటల్, గ్రామపంచాయతీ బిల్డింగ్ నిర్మించుటకు నిధులు మంజూరు చేయాలని అలాగే పడకల్ నుండి పెద్దూరు గేట్ వరకు బిటి రోడ్, తలకొండపల్లి నుండి పడకల్ మీదుగా రావిచేఢ్ వరకు బీటి రోడ్ మంజూరు చేయాలని, వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో పీసీసీ సభ్యులుఆయిల్ శ్రీనివాస్ గౌడ్, పడకల్ గ్రామపంచాయతీ వార్డు సభ్యులు గ్రామ పెద్దలు యువకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.




