Rangareddy: కొండ్రిగానిబోడు తండాలో సీసీ రోడ్డు పనులకు శ్రీకారం!

Rangareddy: కడ్తాల్ మండలం కొండ్రిగానిబోడు తండాలో సీసీ రోడ్డు నిర్మాణానికి సర్పంచ్ శారద బిక్కు నాయక్ భూమి పూజ చేసి పనులను ప్రారంభించారు.

SRI SAILAM, KALWAKURTHY
Published on: 27 Aug 2026 1:21 PM IST
Rangareddy
X

Rangareddy: కొండ్రిగానిబోడు తండాలో సీసీ రోడ్డు పనులకు శ్రీకారం!

Rangareddy: రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండలం ఆగస్టు 27 : కడ్తాల్ మండలంలోని కొండ్రిగానిబోడు తాండ గ్రామపంచాయతీలో ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి సహకారంతో సీసీ రోడ్డు నిర్మాణాని సర్పంచ్ శారద బిక్కు నాయక్ భూమి పూజ చేసి పనులను ప్రారంభించడం జరిగింది.అనంతరం సర్పంచ్ మాట్లాడుతూ ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి సహకారంతో గ్రామాన్ని అభివృద్ధి చేస్తామని అన్నారు.

గ్రామంలో నెలకొన్న సమస్యలను క్రమానుగతంగా పరిష్కరించేందుకు కృషి చేస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ యశోద రాజు నాయక్,మరియు వార్డు సభ్యులు దిప్లా నాయక్,నిర్మల మున్యా నాయక్,స్వప్న నరేష్ నాయక్, గ్రామ పెద్దలు బిచ్య నాయక్,నేజియ్య నాయక్, బిక్య నాయక్,మేగ్య నాయక్, నాగ్య నాయక్,సాలి యువకులు అనిల్,దశరథ్ తదితరులు పాల్గొన్నారు.

SRI SAILAM, KALWAKURTHY

SRI SAILAM, KALWAKURTHY

Next Story