Hyderabad: సరూర్‌నగర్‌లో అదుపుతప్పిన కారు.. ఫుట్‌పాత్‌పైకి దూసుకెళ్లి బీభత్సం!
Hyderabad: హైదరాబాద్ సరూర్‌నగర్ ప్రధాన రహదారిపై సోమవారం మధ్యాహ్నం ఘోర కారు ప్రమాదం జరిగింది.
Hyderabad: సరూర్‌నగర్‌లో అదుపుతప్పిన కారు.. ఫుట్‌పాత్‌పైకి దూసుకెళ్లి బీభత్సం!
హైదరాబాద్: సరూర్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కొత్తపేట – సరూర్‌నగర్ ప్రధాన రహదారిపై సోమవారం మధ్యాహ్నం ఓ కారు అదుపుతప్పి ఫుట్‌పాత్‌పైకి దూసుకెళ్లింది. VM హోమ్ గేటు ముందు ఉన్న ఫుట్‌పాత్‌ను ఎక్కిన మారుతి XL6 (TS 08 H 7775) కారు అక్కడ ఉన్న చెరుకు రసం బండిని ఢీకొట్టింది.
ఈ ఘటనలో చెరుకు రసం బండి పూర్తిగా ధ్వంసం కాగా, కారు ముందు భాగం కూడా తీవ్రంగా దెబ్బతింది. అదృష్టవశాత్తూ ఘటన సమయంలో ఫుట్‌పాత్‌పై పాదచారులు లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ప్రమాదానికి గల కారణాలపై సరూర్‌నగర్ పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు.
Next Story




