Sanathnagar: ఎస్ఐఆర్’ అట్టర్ ఫ్లాప్ ఎన్నికల కమిషన్‌కు తలసాని ఛాలెంజ్!

Sanathnagar: గ్రేటర్ హైదరాబాద్ లో ఎస్ఐఆర్ ఓటర్ల సవరణ ప్రక్రియ విఫలమైందని, 2002 నాటి వివరాలు అడగడం సరికాదని సనత్ నగర్ ఎమ్మెల్యే శ్రీనివాస్ యాదవ్ విమర్శించారు.

Srikanth, Secunderabad
Published on: 13 July 2026 4:44 PM IST
Sanathnagar
X

Sanathnagar: ఎస్ఐఆర్’ అట్టర్ ఫ్లాప్ ఎన్నికల కమిషన్‌కు తలసాని ఛాలెంజ్!

సికింద్రాబాద్: ఈ నెల ఈనెల 25 వ తేది అయిపోయినా గ్రేటర్ హైదరాబాద్ లో కనీసం 10 శాతం ఎస్ ఐ ఆర్ ప్రక్రియ పూర్తి కాదని ఛాలెంజ్ చేసి చెబుతున్నాని మాజీ మంత్రి,సనత్ నగర్ ఏం ఎల్ ఏ తలసాని సీరియస్ కామెంట్స్ చేశారు.

సనత్ నగర్ నియోజకవర్గంలోని బేగంపేట రాంగోపాల్ పేట్ బన్సిలాల్ పేట్ తోపాటు పలు ప్రాంతాల్లో ఓటర్లను అడిగి ఎస్ ఐ ఆర్ కోసం అడిగి తెలుసుకున్నారు..ఎస్ ఐ ఆర్ కార్యక్రమం ప్రాపర్ గా కొనసాగడం లేదని,అందులో చాలా అనుమానాలు ఉన్నాయని ఇది కరెక్ట్ సిస్టమ్ కాదని తలసాని ఆరోపించారు .

ఎన్నికల కమిషన్ ఎస్ ఐ ఆర్ లో విఫలమైందని ,2002 నాటి వివరాలు అడిగితే ప్రజలు ఎక్కడి నుండి ఇస్తారని,అలా అడగడంతో ఓటర్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆయన స్పష్టం చేసారు.అసలు ఎస్ఐఆర్ చేపట్టే విధానమే తప్పుగా ఉందని,ప్రభుత్వానికి కూడా పట్టింపు లేకుండా పోయిందని,కాలనీల్లో,గ్రేటర్లో,బస్తీల్లో,గ్రామాల్లో ఉండే ప్రజలకు చాలా తేడా ఉంటుంది కనుక ఆయా ప్రాంతాలను ప్రజలను బట్టి అధికారులు సిబ్బందిని ఏర్పాటు చేయాలని తలసాని డిమాండ్ చేసారు.

ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సాధారణ ప్రక్రియలో ఎస్ ఐ ఆర్ ఉంటే ప్రజలు ముందుకొచ్చి ఓటర్ నమోదు చేసుకుంటారని లేదంటే ఎన్ని రోజులైనా ఇది ముందుకు పోవడం చాలా కష్టమని తలసాని హితవు పలికారు.

Srikanth, Secunderabad

Srikanth, Secunderabad

Next Story