Vanasthalipuram: రిటైర్డ్ ఉద్యోగి ఫోన్ హ్యాక్.. అలర్ట్ మెసేజ్ రాకుండానే లక్షలు మాయం!

Vanasthalipuram: వనస్థలిపురం అభ్యుదయ నగర్‌కు చెందిన రిటైర్డ్ ఉద్యోగి దయానంద్ ఫోన్ హ్యాక్ చేసిన సైబర్ నేరగాళ్లు రూ.3.78 లక్షలు కాజేశారు.

B SHETTAIAH GOUD, LB NAGAR
Published on: 18 May 2026 9:42 AM IST
Vanasthalipuram
X

Vanasthalipuram: రిటైర్డ్ ఉద్యోగి ఫోన్ హ్యాక్.. అలర్ట్ మెసేజ్ రాకుండానే లక్షలు మాయం!

ఎల్బీనగర్: ఓ విశ్రాంత ఉద్యోగి అమాయకత్వాన్ని ఆసరా చేసుకొని సైబర్ నేరగాళ్లు మోసం చేశారు. ఆయన ఫోన్ ని హ్యాక్ చేసి డబ్బు కాజేసిన సంఘటన వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. వనస్థలిపురంలోని అభ్యుదయ నగ ర్ లో నివాసముంటున్న పెసర కాయల దయానంద్ (68) విశ్రాంత ఉద్యోగి. ఆయన ఫోన్ హ్యాక్ చేసి ఈ నెల 10 నుంచి 13వ తేదీ లోపు బ్యాంకు ఖాతాలో నుంచి మూడు 78 వేలు రూపాయలు కాజేసిన సైబర్ నేరగాళ్లు.. అమెరికాలో ఉన్న ఆయన భార్య సమా చారం ఇవ్వడంతో ఈ విషయం తెలిసింది. ఇద్దరికీ సంయుక్త ఖాతా కావడంతో డబ్బు డ్రా చేసి నట్టు సమాచారం ఆమెకు వచ్చింది. బాధితుడు సైబర్ పోలీసులను ఆశ్రయించడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

B SHETTAIAH GOUD, LB NAGAR

B SHETTAIAH GOUD, LB NAGAR

Next Story