Pargi: లో వోల్టేజ్ సమస్య ఉంటే వెంటనే చెప్పండి: మున్సిపల్ చైర్‌పర్సన్!

Pargi: పరిగి మున్సిపాలిటీ పరిధిలో లో వోల్టేజ్ సమస్యలు ఉంటే తక్షణమే తెలియజేయాలని చైర్‌పర్సన్ కుడుముల రజిత వెంకటేష్ కోరారు.

WAZID, PARIGI
Published on: 13 Aug 2026 4:37 PM IST
Pargi
X

Pargi: లో వోల్టేజ్ సమస్య ఉంటే వెంటనే చెప్పండి: మున్సిపల్ చైర్‌పర్సన్!

PARGI: లో వోల్టేజ్ సమస్యలు ఉంటే వెంటనే తెలియజేయండి.. కొత్త DTRలు ఏర్పాటు చేస్తాం – పరిగి మున్సిపల్ చైర్‌పర్సన్ కుడుముల రజిత వెంకటేష్ పరిగి మున్సిపల్ పరిధిలోని కొన్ని వార్డుల్లో లో వోల్టేజ్ సమస్యలు ఉన్నట్లు మున్సిపల్ చైర్‌పర్సన్ కుడుముల రజిత వెంకటేష్ తెలిపారు.

ప్రజలకు విద్యుత్ సమస్యలు లేకుండా చేయడమే లక్ష్యంగా మున్సిపాలిటీ పనిచేస్తోందన్నారు. ఏ ప్రాంతంలోనైనా, ఏ వార్డులోనైనా లో వోల్టేజ్ సమస్య ఉంటే వెంటనే మున్సిపల్ కార్యాలయం దృష్టికి తీసుకురావాలని ప్రజలను కోరారు. ఫిర్యాదు అందిన వెంటనే సంబంధిత ప్రాంతాన్ని పరిశీలించి, అవసరమైన చోట కొత్త డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్‌ఫార్మర్లు, DTRలు ఏర్పాటు చేసి లో వోల్టేజ్ సమస్యను శాశ్వతంగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.

పరిగి నియోజకవర్గ అభివృద్ధికి ఎమ్మెల్యే డాక్టర్ టి. రామ్మోహన్ రెడ్డి పూర్తి సహకారం అందిస్తున్నారని తెలిపారు. ఎమ్మెల్యే మద్దతుతో పరిగి పట్టణంలో విద్యుత్, తాగునీరు, రోడ్లు, ఇతర మౌలిక వసతులను మరింత అభివృద్ధి చేస్తామని చెప్పారు. ప్రజలు తమ సమస్యలను సంకోచం లేకుండా మున్సిపల్ కార్యాలయానికి తెలియజేయాలని చైర్‌పర్సన్ కుడుముల రజిత వెంకటేష్ విజ్ఞప్తి చేశారు.

WAZID, PARIGI

WAZID, PARIGI

Next Story