Hyderabad: టాస్క్ ఫోర్స్ మెరుపు దాడి గంజాయి విక్రేతల అరెస్ట్!
Hyderabad: యాకుత్‌పురాలో 2.1 కిలోల గంజాయితో ఇద్దరిని అరెస్ట్ చేసిన సికింద్రాబాద్ టాస్క్ ఫోర్స్. రౌడీ షీటర్ సహా ఇద్దరు ఆరెస్ట్, మరొకరు పరారీ.
Hyderabad: టాస్క్ ఫోర్స్ మెరుపు దాడి గంజాయి విక్రేతల అరెస్ట్!
Hyderabad: విశ్వసనీయ సమాచారం మేరకు సికింద్రాబాద్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు NDPS (గంజాయి)విక్రేతలను రైన్ బజార్ పోలీస్ స్టేషన్ పరిధిలో అరెస్టు చేసారు..హైదరాబాద్ నగరంలోని రైన్ బజార్ పోలీస్ స్టేషన్ పరిధిలో గల యాకుత్‌పురా, గంగానగర్ నాలా సమీపంలో సికింద్రాబాద్ జోన్ కమిషనర్ టాస్క్ ఫోర్స్ పోలీసుల బృందం ఇద్దరు (02) నిందితులను అదుపులోకి తీసుకుంది.
వీరి వద్ద నుండి మొత్తం సుమారు 2.100 కిలోల బరువున్న గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.ఇందులో 34 చిన్న ప్లాస్టిక్ ప్యాకెట్లు కాగా రెండు ప్యాకెట్లు పెద్ద ప్యాకెట్లు ఉన్నట్లు తెలిపారు..అబూద్ బిన్ హాజీ బిల్స్‌ఘా (రౌడీ షీటర్) వినయ్ సునార్ లను అరెస్టు చేయగా మరో నిందితుడు హైదర్ అలీ రజ్వీ అలియాస్ హైదర్(రౌడీ షీటర్) పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
Next Story




