Serilingampally: గోపనపల్లి ఇస్కాన్‌లో వైభవంగా శ్రీ కృష్ణాష్టమి వేడుకలు!

Serilingampally: గోపనపల్లి ఇస్కాన్ ఆలయంలో ఘనంగా శ్రీకృష్ణాష్టమి వేడుకలు బీజేపీ నేత రవికుమార్ యాదవ్, గంగాధర్ రెడ్డి ప్రత్యేక పూజలు.

VISHWANATH, SHERILINGAMPALLY
Published on: 4 Sept 2026 7:45 PM IST
Serilingampally
X

Serilingampally: గోపనపల్లి ఇస్కాన్‌లో వైభవంగా శ్రీ కృష్ణాష్టమి వేడుకలు!

Serilingampally: నలగండ్ల డివిజన్ ,గోపనపల్లి గ్రామంలోని ఇస్కాన్ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రీ కృష్ణ జన్మాష్టమి వేడుకలకు హాజరై ఈ సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక పూజలలో పాల్గొన్న బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, శేరిలింగంపల్లి అసెంబ్లీ ఇంచార్జి రవికుమార్ యాదవ్,గచ్చిబౌలి తాజా మాజీ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అందరికీ శ్రీ కృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు తెలుపుతూ మన సాంప్రదాయాలను మర్చిపోకుండా మన పిల్లలకు కూడా తెలియజేసేలా శ్రీ కృష్ణ జన్మాష్టమి వేడుకలు జరుపుకోవడం చాలా మంచి విషయమని, శ్రీ కృష్ణుడి జీవితం సత్యం, ధర్మం, ప్రేమ, భక్తి అనే విలువలకు ఆదర్శమని, శ్రీ కృష్ణడు చెప్పిన భగవద్గీత సందేశం భారతదేశానికి మాత్రమే కాదు, ప్రపంచానికే మార్గదర్శకమని, భగవద్గీతలో శ్రీ కృష్ణుడు చెప్పినట్లు ఫలితం ఆశించకుండా నిజాయితీగా మన బాధ్యత మనం పూర్తిచేస్తే.. ఫలితం దానంతట అదే వస్తుందని, మనం జీవితంలో కృష్ణుని మాటలను గుర్తుచేసుకుంటూ నిజాయితీగా , ధర్మాన్ని పాటిస్తూ మంచిగా ఉండాలని సూచిస్తూ, మనందరిపై శ్రీకృష్ణుని ఆశీస్సులు ఉండాలని , ఆయన కృపతో ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించడం జరిగిందన్నారు,ఈ కార్యక్రమంలో రమేష్ , రంగస్వామి , రఘునాథ్, మరియు స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

VISHWANATH, SHERILINGAMPALLY

VISHWANATH, SHERILINGAMPALLY

Next Story