Hyderabad: వికారాబాద్ జిల్లా పోలీస్ కార్యాలయంలో డీఐజీ వార్షిక తనిఖీ!

Hyderabad: పోలీస్ కార్యాలయాన్ని (DPO) డీఐజీ (DIG) సందర్శించి, వార్షిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా నూతనంగా పునరుద్ధరించిన ఎస్పీ ఛాంబర్‌ను ప్రారంభించారు.

MOGULAIAH, VIKARABAD
Published on: 9 July 2026 9:00 PM IST
Hyderabad
X

Hyderabad: వికారాబాద్ జిల్లా పోలీస్ కార్యాలయంలో డీఐజీ వార్షిక తనిఖీ!

హైదరాబాద్: జిల్లా పోలీస్ కార్యాలయానికి చేరుకున్న డీఐజీ కి వికారాబాద్ జిల్లా ఎస్పీ స్నేహ మెహ్రా, IPS ఘనంగా స్వాగతం పలికారు.అనంతరం డీఐజీ పోలీసు గౌరవ వందనం స్వీకరించారు.

జిల్లా పోలీస్ కార్యాలయం ఆవరణలో మొక్కలు నాటిన అనంతరం ఇటీవల పునరుద్ధరించిన (రీనోవేషన్) ఎస్పీ ఛాంబర్‌ను డీఐజీ ప్రారంభించి పరిశీలించారు.తదనంతరం జిల్లా పోలీస్ కార్యాలయంలోని వివిధ విభాగాలైన డీపీఓ సెక్షన్లు, డీసీఆర్‌బీ (DCRB), డీఎస్‌బీ (DSB), డీఏఆర్ (DAR), పరిపాలనా శాఖలు, రికార్డు విభాగాలు, ఆయుధాగారం, సిబ్బంది నిర్వహణకు సంబంధించిన విభాగాలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు.

ఆయా శాఖల్లో నిర్వహిస్తున్న రికార్డులు, కేసుల నిర్వహణ, పరిపాలనా విధానాలు, ఫైళ్ల నిర్వహణ, సేవా రికార్డులు, కార్యాలయ నిర్వహణ విధానాలను పరిశీలించి అధికారులకు అవసరమైన సూచనలు చేశారు.

ఈ సందర్భంగా డీఐజీ మాట్లాడుతూ,

"జిల్లా పోలీస్ కార్యాలయంలో అన్ని విభాగాల పనితీరును పరిశీలించడం జరిగింది.కార్యాలయంలో రికార్డుల నిర్వహణ, ఫైళ్ల భద్రపరచడం, పరిపాలనా విధానాలు సక్రమంగా ఉండటం ప్రతి పోలీసు అధికారికి ఎంతో ముఖ్యం.

ప్రతి శాఖలో రిజిస్టర్లు, రికార్డులు, కేసు సంబంధిత ఫైళ్లను ఎప్పటికప్పుడు నవీకరిస్తూ, ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా నిర్వహించాలి.కార్యాలయ నిర్వహణలో క్రమశిక్షణ, పరిశుభ్రత, సమయపాలనకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలి.

ప్రజలకు సంబంధించిన వినతులు, ఫిర్యాదులను జాప్యం లేకుండా సంబంధిత శాఖలకు పంపించి, వాటి పరిష్కారంపై నిరంతర పర్యవేక్షణ ఉండాలి.ప్రతి శాఖ పరస్పర సమన్వయంతో పనిచేస్తూ, కార్యాలయ పనితీరును మరింత సమర్థవంతంగా తీర్చిదిద్దాలి.

ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ రికార్డుల నిర్వహణను మెరుగుపరచాలి.ప్రభుత్వ మార్గదర్శకాలను కచ్చితంగా అమలు చేస్తూ, పోలీస్ శాఖ ప్రతిష్ఠను పెంపొందించే విధంగా ప్రతి అధికారి తన బాధ్యతలను నిర్వర్తించాలి అని డి‌ఐ‌జి తెలియజేయడం జరిగింది.

ఇట్టి కార్యక్రమం లో జిల్లా అదనపు ఎస్పీ రాజేశ్ మీనా , IPS , జిల్లా డి‌సి‌ఆర్‌బి డి‌ఎస్‌పి జానయ్య, వికారాబాద్ డి‌ఎస్‌పి అంజయ్య, డి‌టి‌సి డి‌ఎస్‌పి శ్రీనివాస్,DAR డి‌ఎస్‌పి వీరేశ్ అధికారులు ,ఇన్స్పెక్టర్ లు, ఆర్‌ఐ లు, ఎస్‌ఐ లు,ఆర్‌ఎస్‌ఐ లు , సిబ్బంది తదితరులు పాల్గొనడం జరిగింది.

MOGULAIAH, VIKARABAD

MOGULAIAH, VIKARABAD

Next Story