Rangareddy: ఆమనగల్ మండలం శెట్టిపల్లిలో ఉత్సాహంగా సాగిన టీచర్స్ డే వేడుకలు
Rangareddy: రంగారెడ్డి జిల్లా ఆమనగల్ మండలం శెట్టిపల్లి ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించి, ఉపాధ్యాయులను సత్కరించారు.
Rangareddy: ఆమనగల్ మండలం శెట్టిపల్లిలో ఉత్సాహంగా సాగిన టీచర్స్ డే వేడుకలు
Rangareddy: శెట్టిపల్లి గ్రామ పాఠశాలలో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా శెట్టిపల్లి గ్రామ సర్పంచ్ తెల్గమల్ల జంగమ్మ–వెంకటయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా పాఠశాల ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించడంతో పాటు, సర్పంచ్ తెల్గమల్ల జంగమ్మ–వెంకటయ్య కూడా శాల్వాతో సత్కరించారు.
ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ... సమాజ నిర్మాణంలో, విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల పాత్ర ఎంతో కీలకమని అన్నారు. విద్యార్థులకు జ్ఞానాన్ని అందిస్తూ, వారిని ఉన్నత లక్ష్యాల వైపు నడిపిస్తూ, భావితరాలకు మార్గనిర్దేశం చేస్తున్న ప్రతి ఉపాధ్యాయుడికి హృదయపూర్వక ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
“ఉపాధ్యాయులు విద్యార్థుల జీవితాలకు దిశానిర్దేశం చేసే మార్గదర్శకులు. వారి సేవలను ఎల్లప్పుడూ గౌరవించాలి.” అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు మహేందర్ రెడ్డి మరియు ఉపాధ్యాయుల బృందం,విద్యార్థులు పాల్గొనడం జరిగింది.




