Rangareddy: పట్నం మహేందర్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన పొంగులేటి!
Rangareddy: పట్నం మహేందర్ రెడ్డి తల్లి రుక్కమ్మ మృతి పట్ల మంత్రి పొంగులేటి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. చేవెళ్లలోని వారి నివాసానికి వెళ్లి పరామర్శించారు.
Rangareddy: పట్నం మహేందర్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన పొంగులేటి!
ప్రభుత్వ చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
రంగారెడ్డి జిల్లా, చేవెళ్ల:
తెలంగాణ ప్రభుత్వ చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి తల్లి రుక్కమ్మ మృతి పట్ల మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా పట్నం మహేందర్ రెడ్డి నివాసానికి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వచ్చి రుక్కమ్మ చిత్రపటానికి పువ్వులతో నివాళులర్పించారు.
అనంతరం పట్నం మహేందర్ రెడ్డి మరియు కుటుంబ సభ్యులను పరామర్శించి, వారికి ధైర్యం చెప్పారు. రుక్కమ్మ ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబానికి ఈ విషాదాన్ని తట్టుకునే మనోధైర్యం కలగాలని ఆకాంక్షించారు.
ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ లు మరియు రైతులు భూ సమస్యలు మరియు రైతుల సమస్యలకు సంబంధించిన విషయాలను మంత్రికి వివరించారు.
వెంటనే మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సంబంధిత అధికారులకు ఫోన్ చేసి సమస్య పరిష్కరించాలని ఆదేశించాడు.
ఈ కార్యక్రమంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జిల్లా స్థాయి కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.




