Talakondapally: వెల్జాల్ ప్రభుత్వ ఉపాధ్యాయులకు ఘన సన్మానం

Talakondapally: తలకొండపల్లి మండలం వెల్జాల్ ప్రభుత్వ స్కూల్ ఉపాధ్యాయులను మాజీ ఎంపీపీ సీఎల్ శ్రీనివాస్ యాదవ్ ఘనంగా సన్మానించారు. మౌలిక వసతుల కల్పనపై ప్రశంసలు.

SRI SAILAM, KALWAKURTHY
Published on: 5 Sept 2026 7:30 PM IST
Talakondapally
X

Talakondapally: వెల్జాల్ ప్రభుత్వ ఉపాధ్యాయులకు ఘన సన్మానం

తలకొండపల్లి: రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం వెల్జాల్ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులను మాజీ ఎంపీపీ సిఎల్ శ్రీనివాస్ యాదవ్ ఘనంగా సన్మానించారు. గత 20 సంవత్సరాలుగా వెల్జాల్ పాఠశాల ఉపాధ్యాయులను సన్మానిస్తూ, విద్యాభివృద్ధికి తన వంతు సహకారం అందిస్తున్నారని తెలిపారు.

విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పాఠశాలలో మెరుగైన వసతులు కల్పించేందుకు సిఎల్ శ్రీనివాస్ యాదవ్ ప్రత్యేక శ్రద్ధ చూపించారు. పాఠశాల తరగతి గదులు, భోజనశాలతో పాటు విద్యార్థులకు అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పించి పాఠశాలను అన్ని సౌకర్యాలతో తీర్చిదిద్దేందుకు కృషి చేశారు.

విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల పాత్ర ఎంతో కీలకమని, గ్రామీణ ప్రాంతాల్లోని ప్రభుత్వ పాఠశాలలు అభివృద్ధి చెందితేనే విద్యార్థులకు మెరుగైన విద్య అందుతుందని సిఎల్ శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, ఉపాధ్యాయురాళ్లు, సర్పంచ్ వారనాసి రాములమ్మ, ఉపసర్పంచ్ శివ విజయలక్ష్మి, నాయకులు వారనాసి వెంకటేష్, శివ విజయ్ కుమార్, మాజీ జిల్లా కో-ఆప్షన్ సభ్యుడు ముజీబుర్ రహెమాన్, పంచాయతీ కార్యదర్శి వాజిద్, మస్క వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు.

SRI SAILAM, KALWAKURTHY

SRI SAILAM, KALWAKURTHY

Next Story