Hyderabad: అబ్దుల్లాపూర్మెట్ మండలం ఇనాంగూడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం!
Hyderabad: మండలం ఇనాంగూడ వద్ద ఆగి ఉన్న డీసీఎం వాహనాన్ని విజయవాడ నుంచి వస్తున్న ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో పలువురు ప్రయాణికులకు గాయాలయ్యాయి.
Hyderabad: అబ్దుల్లాపూర్మెట్ మండలం ఇనాంగూడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం!
Hyderabad: అబ్దుల్లాపూర్మెట్ మండలం ఇనాంగూడ వద్ద గురువారం రాత్రి రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆగి ఉన్న డీసీఎం వాహనాన్ని ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. విజయవాడ నుంచి హైదరాబాద్కు వస్తున్న ఆర్టీసీ బస్సు ఇనాంగూడ సమీపంలో ఆగి ఉన్న డీసీఎంను ఢీకొట్టినట్లు సమాచారం.
డీసీఎంలో ఐరన్ లోడ్ ఉండటంతో ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో పలువురు బస్సు ప్రయాణికులకు తీవ్ర గాయాలైనట్లు సమాచారం. గాయపడిన వారిని వెంటనే సమీపంలోని ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని ప్రమాదంపై దర్యాప్తు చేపట్టారు.
Next Story




