Shankarpally: ఐబీఎస్ క్యాంపస్‌లో విషాదం.. విద్యార్థి ఆత్మహత్య!

Shankarpally: రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లి ఐబీఎస్ క్యాంపస్‌లో జార్ఖండ్‌కు చెందిన విద్యార్థి అమన్ రాజు ఆత్మహత్య కలకలం రేపింది. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

RAGHAVENDRA, CHEVELLA
Published on: 5 Sept 2026 9:41 AM IST
Shankarpally
X

Shankarpally: ఐబీఎస్ క్యాంపస్‌లో విషాదం.. విద్యార్థి ఆత్మహత్య!

Shankarpally: శంకర్‌పల్లి మండలం పరిధిలోని IBS క్యాంపస్‌లో ఓ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడటం కలకలం రేపింది. మృతుడిని జార్ఖండ్‌కు చెందిన 23 ఏళ్ల విద్యార్థి అమన్ రాజుగా పోలీసులు గుర్తించారు. క్యాంపస్‌లోని తన గదిలో అమన్ రాజు మృతదేహాన్ని గుర్తించిన కళాశాల యాజమాన్యం పోలీసులకు సమాచారం అందించారు.

వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. విద్యార్థి కుటుంబ సభ్యులకు పోలీసులు సమాచారం అందించగా, జార్ఖండ్‌లో ఉన్న అమన్ రాజు తల్లిదండ్రులు స్వస్థలం నుంచి శంకర్‌పల్లికి బయలుదేరి వస్తున్నట్లు తెలుస్తోంది.

ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు, అమన్ రాజు ఆత్మహత్యకు గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు. మానసిక ఒత్తిడి, వ్యక్తిగత కారణాలు లేదా ఇతర అంశాలు ఏమైనా ఉన్నాయా అనే కోణాల్లో పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. అమన్ రాజు మృతికి సంబంధించిన పూర్తి వివరాలు, పోలీసుల దర్యాప్తు అనంతరం వెల్లడయ్యే అవకాశం ఉంది.

RAGHAVENDRA, CHEVELLA

RAGHAVENDRA, CHEVELLA

Next Story