Ranga Reddy: కెమిస్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జాతీయ జెండా ఆవిష్కరణ!
Ranga Reddy: రంగారెడ్డి జిల్లా కెమిస్ట్స్ అండ్ డ్రగ్గిస్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వేడుకలు. శ్రవణ్ కుమార్కు బెస్ట్ కెమిస్ట్ అవార్డు అందజేసిన పెండెం కృష్ణ కుమార్.
Ranga Reddy: కెమిస్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జాతీయ జెండా ఆవిష్కరణ!
Ranga Reddy: రంగారెడ్డి జిల్లా కెమిస్ట్స్ అండ్ డ్రగ్గిస్ట్స్ అసోసియేషన్ అధ్యక్షులు డాక్టర్ పెండెం కృష్ణ కుమార్ ఆధ్వర్యంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మోయినాబాద్కు చెందిన విష్ణు మెడికల్ & జనరల్ స్టోర్స్ నిర్వాహకులు ఎం. శ్రవణ్ కుమార్ను బెస్ట్ కెమిస్ట్ అవార్డుతో సత్కరించారు.
ఈ సందర్భంగా అసోసియేషన్ అధ్యక్షులు డాక్టర్ పెండెం కృష్ణ కుమార్ మాట్లాడుతూ.. ఔషధ రంగంలో నిబద్ధతతో సేవలందిస్తూ, ప్రజలకు నాణ్యమైన మందులను అందించడంలో విశిష్ట సేవలు చేస్తున్న కెమిస్టులను గుర్తించి ప్రోత్సహించడమే ఈ అవార్డుల ఉద్దేశమని తెలిపారు. ఎం. శ్రవణ్ కుమార్ తన సేవలతో ఈ అవార్డుకు అర్హత సాధించారని, భవిష్యత్తులో మరింతగా ప్రజలకు సేవ చేయాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లాకు చెందిన పలువురు స్థానిక కెమిస్టులు పాల్గొని స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు.




