Tandur: కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సమక్షంలో బీజేపీ జిల్లా అధ్యక్ష బాధ్యతలు!

Tandur: వికారాబాద్ జిల్లా నూతన బీజేపీ అధ్యక్షుడిగా రమేష్ కుమార్ బాధ్యతల స్వీకరణ. ఆదివారం తాండూరులో కిషన్ రెడ్డి, కొండా విశ్వేశ్వర్ రెడ్డిల సమక్షంలో ప్రమాణ స్వీకారం.

Srikanth Reddy, Tandur
Published on: 29 Aug 2026 6:26 PM IST
Tandur
X

Tandur: కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సమక్షంలో బీజేపీ జిల్లా అధ్యక్ష బాధ్యతలు!

Tandur: తాండూరు,వికారాబాద్, పరిగి నియోజక వర్గాల్లో విజయమే లక్ష్యంగా ప్రత్యేక కార్యాచరణతో ముందుకు సాగుతున్నామని వికారాబాద్ జిల్లా నూతన బీజేపీ అధ్యక్షుడు రమేష్ కుమార్ అన్నారు. శనివారం తాండూరు పట్టణంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు పాల్గొని మట్లాడుతూ.

ఆదివారం వీరశైవ కళ్యాణ మండలంలో జరిగే కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి తదితర ముఖ్య నాయకుల సమక్షంలో జిల్లా నూతన అధ్యక్ష బాధ్యతలు స్వీకరించడం జరుగుతుందన్నారు. రాష్ట్రం లో బీ ఆర్ ఎస్ ప్రతిపక్షంగా పూర్తిగా విఫలం అయిందన్నారు. కాంగ్రెస్ తో లోపాయికారి ఒప్పందాలు చేసుకొని రాష్ట్ర అభివృద్ధి కి విఘాతం కలిగిస్తోందన్నారు.

17వేల కోట్ల ఫీజు రెంబర్స్మెంట్ చెల్లించాలని రాష్ట్ర అధ్యక్షులు రామచందర్ రావు రెండు రోజులపాటు రిలే నిరహార దీక్ష చేసిన ప్రభుత్వానికి చీమకుటినట్లు కూడా లేదన్నారు. బీ ఆర్ ఎస్, కాంగ్రెస్ ప్రజల విశ్వాసాన్ని చూరగొనడంలో విఫలం అయిందన్నారు. విద్యా శాఖను తన వద్దనే ఉంచుకున్న ముఖ్యమంత్రి విద్యార్థులకు న్యాయం చేయడం లేదన్నారు.

Srikanth Reddy, Tandur

Srikanth Reddy, Tandur

Next Story