Tarnaka: హిందూ దళిత రిజర్వేషన్ల సంరక్షణకు రక్షాబంధన్ ఉద్యమం!

Tarnaka: హిందూ దళిత రిజర్వేషన్ల సంరక్షణకు తార్నాకలో రక్షాబంధన్ ఉద్యమాన్ని ఐక్యవేదిక అధ్యక్షుడు డాక్టర్ వంశతిలక్ ప్రారంభించారు. భాజపా నేతకు రాఖీ కట్టారు.

HARISH, TARNAKA
Published on: 28 Aug 2026 1:54 PM IST
Tarnaka
X

Tarnaka: హిందూ దళిత రిజర్వేషన్ల సంరక్షణకు రక్షాబంధన్ ఉద్యమం!

Tarnaka: దేశంలో దశాబ్దాలుగా దళిత రిజర్వేషన్ల అమలులో నిజమైన హిందూ దళితులకు తగిన న్యాయం జరగడం లేదని దళిత హిందూ సంఘాల ఐక్యవేదిక అధ్యక్షుడు డాక్టర్ వంశతిలక్ ఆరోపించారు. హిందూ దళితులకు రాజకీయ పార్టీల్లోనూ, ప్రభుత్వ నామినేటెడ్ పదవుల్లోనూ తగిన ప్రాధాన్యత కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు.

ఈ మేరకు ఐక్యవేదిక ఆధ్వర్యంలో తార్నాకలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచంద్రరావును ఆయన నివాసంలో కలిసి, ఐక్యవేదిక మహిళా ప్రతినిధులు రాఖీ కట్టారు. అనంతరం హిందూ దళిత రిజర్వేషన్ల సంరక్షణ రక్షాబంధన్ ఉద్యమ బస్సును ప్రారంభించారు. ఈ సందర్భంగా డాక్టర్ వంశతిలక్ మాట్లాడుతూ, దేశంలో హిందూ దళితులకు రిజర్వేషన్ల ఫలాలు పూర్తిస్థాయిలో అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

పేదరికంలో మగ్గుతున్న దళిత కుటుంబాలకు సామాజిక, రాజకీయ రంగాల్లో తగిన న్యాయం జరగాల్సిన అవసరం ఉందన్నారు. హిందూ దళిత రిజర్వేషన్ల సంరక్షణ కోసం రాఖీ పౌర్ణమిని పురస్కరించుకొని రక్షాబంధన్ ఉద్యమాన్ని ప్రారంభించినట్లు తెలిపారు.

అన్ని రాజకీయ పార్టీలు హిందూ దళితులకు తగిన రాజకీయ ప్రాతినిధ్యం కల్పించడంతో పాటు ప్రభుత్వ నామినేటెడ్ పదవుల్లో అవకాశాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జితేందర్, ప్రకాష్, సంజయ్ కామ్లే, మీనా, సునీత తదితరులు పాల్గొన్నారు.

HARISH, TARNAKA

HARISH, TARNAKA

Next Story