Nagole: నాగోల్ పోలీస్‌స్టేషన్‌లో రాఖీ సందడి.. సోదరభావం చాటిన పోలీసులు!

Nagole: రక్షాబంధన్ సందర్భంగా నాగోల్ పోలీస్‌స్టేషన్‌లో రాఖీ వేడుకలు ఘనంగా జరిగాయి. పోలీస్ అధికారులకు మహిళా సిబ్బంది రాఖీలు కట్టగా, ఇన్‌స్పెక్టర్ మక్బూల్ జానీ కానుకలు అందజేశారు.

B SHETTAIAH GOUD, LB NAGAR
Published on: 28 Aug 2026 8:03 PM IST
Nagole
X

Nagole: నాగోల్ పోలీస్‌స్టేషన్‌లో రాఖీ సందడి.. సోదరభావం చాటిన పోలీసులు!

నాగోల్‌: రక్షాబంధన్‌ సందర్భంగా నాగోల్‌ పోలీస్‌స్టేషన్‌లో రాఖీ పండుగ వేడుకలు ఘనంగా నిర్వహించారు. పోలీసు సిబ్బంది మధ్య సోదరభావాన్ని చాటుతూ మహిళా పోలీసు సిబ్బంది అధికారులకు రాఖీలు కట్టి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఐలు పి. శివ నాగ ప్రసాద్‌, నర్సింహ, ఉమా, మమతతో పాటు మహిళా పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

ఈ సందర్భంగా నాగోల్‌ పోలీస్‌స్టేషన్‌ ఇన్‌స్పెక్టర్‌ మహమ్మద్‌ మక్బూల్‌ జానీ మహిళా పోలీసు సిబ్బందిని అభినందించారు. రాఖీ పండుగ సందర్భంగా వారికి కానుకలు అందజేసి గౌరవించారు. సోదర సోదరీమణుల మధ్య ప్రేమ, ఆప్యాయత, పరస్పర గౌరవానికి రాఖీ పండుగ ప్రతీకగా నిలుస్తుందని సిబ్బంది పేర్కొన్నారు. పోలీసు కుటుంబంలో ఆత్మీయతను పెంపొందించేలా నిర్వహించిన ఈ వేడుకలు ఉత్సాహంగా సాగాయి.

B SHETTAIAH GOUD, LB NAGAR

B SHETTAIAH GOUD, LB NAGAR

Next Story