Thalakondapally: వెల్జాల్ గ్రామంలో గణేష్ నవరాత్రి ఉత్సవాల ఏర్పాట్లు!
Thalakondapally: తలకొండపల్లి మండలం వెల్జాల్‌లో గణేష్ ఉత్సవాలకు బీజేపీ నేత రాఘవేందర్ గౌడ్ రూ.20 వేల విలువైన ఆంప్లిఫైయర్ విరాళం. కమిటీ సభ్యుల హర్షం.
Thalakondapally: వెల్జాల్ గ్రామంలో గణేష్ నవరాత్రి ఉత్సవాల ఏర్పాట్లు!
Thalakondapally: తలకొండపల్లి మండలంలోని వెల్జాల్ గ్రామం మూడో వార్డులో ప్రతి ఏడాది వినాయక మండపం వద్ద గణేష్ ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహిస్తున్నారు. గణేష్ ఉత్సవాలు ప్రజల్లో భక్తిభావంతో పాటు ఐక్యత, సోదరభావాన్ని పెంపొందించేందుకు దోహదపడతాయని, యువత పెద్దఎత్తున పాల్గొని ఉత్సవాలను విజయవంతం చేయాలని నిర్వాహకులు తెలిపారు.
ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు శ్రీశ్రీశ్రీ చెన్నకేశవస్వామి యూత్ అసోసియేషన్ కమిటీ సభ్యులు ఏర్పాట్లు చేస్తున్నారు. కమిటీ సభ్యుల కోరిక మేరకు వెల్జాల్ సీనియర్ బీజేపీ నాయకుడు తిరుమణి రాఘవేందర్ గౌడ్ రూ.20 వేల విలువైన ఆంప్లిఫైయర్‌ను విరాళంగా అందజేశారు. గణేష్ ఉత్సవాల నిర్వహణకు తన వంతు సహకారం అందించడం సంతోషంగా ఉందని ఆయన తెలిపారు.
వినాయక చవితి సందర్భంగా యువత, గ్రామస్థులు కలిసికట్టుగా ఉత్సవాలు నిర్వహించి ప్రశాంత వాతావరణంలో భక్తి కార్యక్రమాలను కొనసాగించాలని రాఘవేందర్ గౌడ్ ఆకాంక్షించారు. అనంతరం కమిటీ సభ్యులు ఆయనను పుష్పగుచ్ఛంతో ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు ఇంజమూరి నరసింహ, చింతకాయల రాము, కమిటీ సభ్యులు రామకృష్ణ, యాదగిరి, రమేష్, శ్రీశైలం, వేణు, యాదగిరి, మధు, కిషోర్ తదితరులు పాల్గొన్నారు.




