Kadthal: కొంగళ్ల వెంకటయ్య కుటుంబానికి రూ.5,000 ఆర్థిక సాయం జర్పుల దశరథ్
Kadthal: న్యామంతాపూర్ గ్రామంలో మృతి చెందిన కొంగళ్ల వెంకటయ్య కుటుంబానికి రాధాకృష్ణ మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ జర్పుల దశరథ్ నాయక్ రూ. 5,000 ఆర్థిక సాయం అందజేసి పరామర్శించారు.
Kadthal: కొంగళ్ల వెంకటయ్య కుటుంబానికి రూ.5,000 ఆర్థిక సాయం జర్పుల దశరథ్
కడ్తాల్: కడ్తాల్ మండల పరిధిలోని న్యామంతాపూర్ గ్రామంలో నిన్న అనారోగ్యంతో బాధపడుతూ కొంగళ్ల వెంకటయ్య మృతి చెందారు.ఈ విషయం మాజీ సర్పంచ్ రవీందర్ రెడ్డి సమాచారం మేరకు తెలుసుకున్న కడ్తాల్ మాజీ జెడ్పీటీసీ, రాధాకృష్ణ మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ అధినేత లంబాడి హక్కుల పోరాట సమితి రాష్ట్ర ఉపాధ్యక్షుడు జర్పుల దశరథ్ నాయక్ వెంటనే స్థానిక నాయకులతో కలిసి న్యామంతపూర్ చేరుకొని తమ ట్రస్టు ద్వారా ఐదువేల రూపాయలు ఆర్థిక సాయం అందించారు,
అదేవిధంగా మృతుని కుటుంబానికి మనో ధైర్యాన్ని కల్పించారు ఆయన మాట్లాడుతూ కడ్తాల్ మండలంలో నిరుపేద కుటుంబాలకు ఎప్పుడు రాధాకృష్ణ మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ అండగా ఉంటుందని తెలియజేశారు తమ ట్రస్టు ప్రారంభించి ఆరు సంవత్సరాల నుండి కడ్తాల్ మండలంలో ఉన్న పేద ప్రజలకు అనేక సేవా కార్యక్రమాలు అందిస్తున్నామని వారు సూచించారు.
ఈ కార్యక్రమంలో సర్పంచ్ ప్రియా రమేష్ ఉప సర్పంచ్ శ్రీనివాస్ గౌడ్ మాజీ సర్పంచ్ సులోచన సాయిలు నాయకులు కృష్ణయ్య రమేష్ యాదగిరి మల్లేష్ నాయకులు ,గ్రామ పెద్దలు పాల్గొన్నారు.




