Qutubullapur: కాలనీల అభివృద్ధిలో సంక్షేమ సంఘాల పాత్ర కీలకం ఎమ్మెల్యే కేపీవీ

Qutubullapur: పేట్ బషీరాబాద్ క్యాంప్ కార్యాలయంలో సూరారం డివిజన్ లక్ష్మీనగర్ వెల్ఫేర్ అసోసియేషన్ నూతన సభ్యులను సత్కరించిన బీఆర్ఎస్ ఎల్పీ విప్, ఎమ్మెల్యే కేపీ.వివేకానంద్.

BOMMA SRIDHAR, QUTHBULLAPUR
Published on: 27 July 2026 4:08 PM IST
Qutubullapur
X

Qutubullapur: కాలనీల అభివృద్ధిలో సంక్షేమ సంఘాల పాత్ర కీలకం ఎమ్మెల్యే కేపీవీ

క్కుతుబుల్లాపూర్: ఈరోజు పేట్ బషీరాబాద్ లోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో 129 - సూరారం డివిజన్ లక్ష్మి నగర్ రెసిడెన్సీ వెల్ఫేర్ అసోసియేషన్ నూతన సంక్షేమ సంఘం సభ్యులు బిఆర్ఎస్ ఎల్పి విప్, ఎమ్మెల్యే కేపీ. వివేకానంద్ ని మర్యాదపూర్వకంగా కలిశారు.

ఈ సందర్భంగా నూతన అధ్యక్షురాలిగా ఎన్నికైన నామిరెడ్డి అమృత, ప్రధాన కార్యదర్శి హరి శంకర్ రావులతో పాటు నూతన వెల్ఫేర్ కమిటీ సభ్యులను ఎమ్మెల్యే శాలువాతో సత్కరించి అభినందనలు తెలియజేశారు.

అనంతరం వారు మాట్లాడుతూ... కాలనీ అభివృద్ధిలో సంక్షేమ సంఘాల పాత్ర ఎంతో కీలకమని, లక్ష్మీ నగర్ తో పాటు నియోజకవర్గంలోని అనేక కాలనీలు, బస్తీలలో కోట్లాది రూపాయల నిధులతో మౌలిక వసతులను అభివృద్ధి పరిచామని, రానున్న రోజుల్లో కూడా లక్ష్మీ నగర్ అభివృద్ధికి తన సహాయ సహకారాలు ఎప్పుడూ ఉంటాయని అన్నారు.

ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ సీనియర్ నాయకులు కొండకల్ల యాదిరెడ్డి, కొండకల్ల శ్రీనివాస్ రెడ్డి, కోల శ్రీకాంత్ ముదిరాజ్, వెల్ఫేర్ అసోసియేషన్ సలహాదారులు సురేష్, కె. రాఘవేందర్ రెడ్డి, ఇంద్రసేన, ప్రభు లింగం, కె.వి. రమణ, ఏ. వెంకటేశ్వర్ రావు, సభ్యులు సాయి ప్రేమ్, వెంకటప్ప రెడ్డి, ప్రసాద్ రెడ్డి,ఎన్. యశ్వంత్ రెడ్డి, క్రిష్ణ తదితరులు పాల్గొన్నారు.

BOMMA SRIDHAR, QUTHBULLAPUR

BOMMA SRIDHAR, QUTHBULLAPUR

Next Story