Qutubullapur: కుత్బుల్లాపూర్‌లో 'ఫీజు బకాయి – బీజేపీ లడాయి'
Qutubullapur: కుత్బుల్లాపూర్‌లో 'ఫీజు బకాయి – బీజేపీ లడాయి' కార్యక్రమం. పెండింగ్ స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్ విడుదల చేయాలని BJYM డిమాండ్.
Qutubullapur: కుత్బుల్లాపూర్‌లో 'ఫీజు బకాయి – బీజేపీ లడాయి'
కుత్బుల్లాపూర్: కుత్బుల్లాపూర్ లో “ఫీజు బకాయి – బీజేపీ లడాయి” కార్యక్రమంలో భాగంగా BJYM రాష్ట్ర సోషల్ మీడియా కన్వీనర్ నాగదీప్ గౌడ్, రావుల పృథ్వీ, మంజునాథ్ కలిసి వివిధ కళాశాలల్లోని విద్యార్థులను కలిశారు.
ఈ సందర్భంగా విద్యార్థులతో నేరుగా మాట్లాడి, వారికి రావాల్సిన స్కాలర్‌షిప్‌లు మరియు ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు సకాలంలో అందకపోవడం వల్ల వారు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తెలుసుకున్నారు.
విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించిన ఈ కీలక అంశంపై ప్రభుత్వం వెంటనే స్పందించి, పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్ మరియు స్కాలర్‌షిప్ బకాయిలను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బీజేపీ–BJYM విద్యార్థుల పక్షాన పోరాటం చేస్తోందని వారికి వివరించారు.
విద్యార్థుల హక్కుల కోసం, వారి భవిష్యత్తు కోసం బీజేపీ–BJYM చేస్తున్న పోరాటానికి ప్రతి విద్యార్థి అండగా నిలవాలని పిలుపునిచ్చారు.




