Quthbullapur: కొత్త పోలింగ్ కేంద్రాల ఏర్పాటుకై తహసీల్దార్‌కు వినతి!
Quthbullapur: గాజులరామారం, మహాదేవపురం పరిధిలో కొత్త పోలింగ్ స్టేషన్ల కోసం డిప్యూటీ తహసీల్దార్‌కు సాయినాథ్ నేత బృందం వినతిపత్రం సమర్పణ.
Quthbullapur: కొత్త పోలింగ్ కేంద్రాల ఏర్పాటుకై తహసీల్దార్‌కు వినతి!
కుత్బుల్లాపూర్: ఈరోజు ఉమ్మడి గాజులరామారం డివిజన్ నుంచి కొత్తగా ఏర్పడిన మహాదేవపురం డివిజన్ గాజులరామారం డివిజన్ రోడమేస్త్రి నగర్ డివిజన్ కు సంబంధించి కొత్త పోలింగ్ స్టేషన్ కేంద్రాల ఏర్పాటుకై ఉమ్మడి గాజులరామారం డివిజన్ అధ్యక్షులు సాయినాథ్ నేత ఆధ్వర్యంలో కుత్బుల్లాపూర్ తాసిల్దార్ కార్యాలయంలో డిప్యూటీ తాసిల్దార్ సుధాకర్ కి వినతి పత్రం ఇవ్వడం జరిగింది.
1. కైలాష్ హిల్స్ షిరిడి హిల్స్ మహాదేవపురం కు సంబంధించి బ్రైట్ వీళ్ళే స్కూల్లో కొత్తగా పోలింగ్ స్టేషన్ ఏర్పాటు చేయాలని మనవి.2. రవి నారాయణ రెడ్డి నగర్ ఫేస్ 1,2,3,4 మరియు కమలమ్మ నగర్ కు సంబంధించి గవర్నమెంట్ ప్రైమరీ స్కూల్ వెంకటేశ్వర స్వామి గుడి వెనకాల ఏర్పాటు చేయాలని మనవి.
3. లెనిన్ నగర్ అంబేద్కర్ నగర్ కు సంబంధించి చైతన్య విద్యాలయ మరియు సురభి స్కూల్లో పోలింగ్ స్టేషన్ ఏర్పాటు చేయాలని మనవి.
4. శ్రీరామ్ నగర్-ఏ,బి మరియు వల్లభాయ్ పటేల్ నగర్ కు సంబంధించి శ్రీరాంనగర్ కమ్యూనిటీ హాల్ లో పోలింగ్ స్టేషన్ ఏర్పాటు చేయాలని మనవి.
పైన ఇచ్చిన వివరాల ప్రకారం డిప్యూటీ తాసిల్దార్ సానుకూలంగా స్పందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో రేవతి రెడ్డి రాష్ట్ర యువ మోర్చా నాయకురాలు, సునీల్ పాటిల్ జిల్లా కార్యవర్గ సభ్యులు, నరేష్ గౌడ్ డివిజన్ సీనియర్ నాయకులు, శారద డివిజన్ సీనియర్ నాయకురాలు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.




