Quthbullapur: గాజులరామారంలో రూ.2 కోట్లతో సీసీ రోడ్ల పనులకు శంకుస్థాపన!

Quthbullapur: కుత్బుల్లాపూర్ మహాదేవపురం డివిజన్‌లో రూ.2 కోట్లతో సీసీ రోడ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్.

BOMMA SRIDHAR, QUTHBULLAPUR
Published on: 3 Aug 2026 5:10 PM IST
Quthbullapur
X

Quthbullapur: గాజులరామారంలో రూ.2 కోట్లతో సీసీ రోడ్ల పనులకు శంకుస్థాపన!

కుత్బుల్లాపూర్: కుత్బుల్లాపూర్ నియోజకవర్గ పరిధిలోని గాజులరామారం సర్కిల్, మహాదేవపురం డివిజన్‌లోని బతుకమ్మ బండ ప్రాంతంలో రూ.80 లక్షల వ్యయంతో, అలాగే కైసర్ నగర్‌లో రూ.1.20 కోట్ల వ్యయంతో మంజూరైన మొత్తం 2 కోట్ల విలువైన సీసీ రోడ్ల నిర్మాణ పనులకు ఈరోజు కుత్బుల్లాపూర్ మొట్టమొదటి ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, స్థానిక బస్తీ వాసులు రోడ్ల సౌకర్యం లేకపోవడంతో ప్రతి వర్షాకాలంలో వర్షపు నీరు ఇళ్లలోకి చేరి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. ప్రజల సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని పేర్కొన్నారు.

గత 10 సంవత్సరాల బీఆర్ఎస్ పాలనలో నియోజకవర్గంలో ఆశించిన స్థాయిలో అభివృద్ధి కార్యక్రమాలు జరగలేదని ఆయన విమర్శించారు. ప్రస్తుతం గెలిచిన ఎమ్మెల్యే హ్యాట్రిక్ ఎమ్మెల్యే అని చెప్పుకుంటూ సోషల్ మీడియాలో యాక్టింగ్ చేయడం తప్ప అభివృద్ధిపై దృష్టి సాధించకుండా ఎంతసేపు ప్రభుత్వం వద్ద నిధులు లేవంటూ ప్రభుత్వాన్ని బద్నాం చేస్తూ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయకుండా అడ్డుకుంటున్నారని మండిపడ్డారు, ప్రజా ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలో ప్రజల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి పనులు చేపడుతున్నామని తెలిపారు.

సీసీ రోడ్ల నిర్మాణానికి నిధులు మంజూరు చేయడంలో సహకరించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, మంత్రి శ్రీధర్ బాబు కి ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు, ప్రభుత్వం సంక్షేమ పథకాలు ఉచిత విద్యుత్తు,ఉచిత బస్సు, సన్న బియ్యం,వంటి పథకాలను ప్రభుత్వం అమలు పరుస్తుందని తెలిపారు, రామన్న మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులను గెలిపించి మరింత అభివృద్ధికి దోహతపడాలని స్థానికులను ఉద్దేశించి ప్రసంగించారు..

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ డిసిసి ఉపాధ్యక్షులు శ్రీ కూన శ్రీనివాస్ గౌడ్ తో పాటు స్థానిక నాయకులు బుచ్చిరెడ్డి, తోసిఫ్, పూలమ్మ,ప్రసాద్,నరేందర్ రెడ్డి, జమీల్ పాషా, పరమేశ్వర్ పంతులు, సంగయ్య, మహేష్ రెడ్డి, రాములు,జబ్బర్,రసూల్, ముక్తార్ భవానీ ,సలీం,తదితరులు పాల్గొన్నారు.

BOMMA SRIDHAR, QUTHBULLAPUR

BOMMA SRIDHAR, QUTHBULLAPUR

Next Story