Quthbullapur: కుత్బుల్లాపూర్: డ్రైనేజీ కష్టాలకు ముగింపు

Quthbullapur: కుత్బుల్లాపూర్: ఎమ్మెల్యే కేపీ వివేకానంద చొరవతో సాయిబాబా నగర్, మరాఠీ బస్తీ, సిద్ధార్థ నగర్ ప్రాంతాల్లో అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ సమస్య పరిష్కారమైంది.

BOMMA SRIDHAR, QUTHBULLAPUR
Published on: 4 Aug 2026 7:08 AM IST
Quthbullapur
X

Quthbullapur: కుత్బుల్లాపూర్: డ్రైనేజీ కష్టాలకు ముగింపు

కుత్బుల్లాపూర్ బొమ్మ శ్రీధర్

డ్రైనేజీ కష్టాలకు ముగింపు

292వ డివిజన్ పరిధిలోని సాయిబాబా నగర్, మరాఠీ బస్తీ, సిద్దార్థ నగర్ ప్రాంతాల్లో ఎన్నో రోజులుగా ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్న అండర్గ్రౌండ్ డ్రైనేజీ సమస్యకు పరిష్కారం లభించింది. స్థానికుల విజ్ఞప్తిపై బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు వారాల వినోద్ కుమార్ చొరవ తీసుకుని సమస్యను కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద దృష్టికి తీసుకెళ్లారు. సమస్య తీవ్రతను గుర్తించిన ఎమ్మెల్యే సంబంధిత అధికారులతో వెంటనే మాట్లాడి శాశ్వత పరిష్కారానికి అవసరమైన చర్యలు చేపట్టాలని ఆదేశించినట్లు సమాచారం. దీంతో చాలా కాలంగా పేరుకుపోయిన డ్రైనేజీ సమస్యకు పరిష్కారం దొరకడంతో స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా మరాఠీ బస్తీ అధ్యక్షుడు అశోక్ మాట్లాడుతూ, ప్రజా సమస్యను వెంటనే స్పందించి పరిష్కార దిశగా చర్యలు తీసుకున్న వారాల వినోద్ కుమార్, ఎమ్మెల్యే కేపీ వివేకానందలకు బస్తీ ప్రజల తరపున కృతజ్ఞతలు తెలిపారు. ప్రజలకు ఇబ్బందులు కలిగించిన సమస్యకు ముగింపు పలకడం ఆనందంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో రాజ్ కుమార్ ముదిరాజ్, స్థానిక బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు మరియు బస్తీ వాసులు పాల్గొన్నారు. చిరకాల సమస్యకు తెర ధన్యవాదాలు తెలిపిన మరాఠీ బస్తీ వాసులు.

BOMMA SRIDHAR, QUTHBULLAPUR

BOMMA SRIDHAR, QUTHBULLAPUR

Next Story