LB Nagar: ఎల్బీనగర్ కూడలిలో ఘనంగా ప్రొఫెసర్ జయశంకర్ 92వ జయంతి వేడుకలు!

LB Nagar: తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ 92వ జయంతి సందర్భంగా ఎల్బీనగర్ కూడలిలోని ఆయన విగ్రహానికి ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి

B SHETTAIAH GOUD, LB NAGAR
Published on: 6 Aug 2026 12:33 PM IST
LB Nagar
X

LB Nagar: ఎల్బీనగర్ కూడలిలో ఘనంగా ప్రొఫెసర్ జయశంకర్ 92వ జయంతి వేడుకలు!

LB Nagar: తెలంగాణ సిద్ధాంతకర్త, ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ 92వ జయంతి సందర్భంగా ఎల్బీనగర్ కూడలిలోని ఆయన విగ్రహానికి ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులు, పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమానికి ప్రొఫెసర్ జయశంకర్ అందించిన సిద్ధాంత బలం, ఆయన చేసిన త్యాగాలు చిరస్మరణీయమని అన్నారు. తెలంగాణపై సంపూర్ణ అవగాహనతో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో కలిసి ప్రజలను చైతన్యపరిచి రాష్ట్ర సాధనలో జయశంకర్ కీలక పాత్ర పోషించారని కొనియాడారు.

జయశంకర్ ఆశయాలను స్మరించుకుంటూ అభివృద్ధి చెందిన, బంగారు తెలంగాణ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఆయన కలలు సాకారం కావాలంటే సమగ్ర అభివృద్ధి సాధించిన తెలంగాణను నిర్మించడమే నిజమైన నివాళి అవుతుందని పేర్కొన్నారు. తెలంగాణ ప్రజలంతా ఆయన చూపిన మార్గంలో నడుస్తూ రాష్ట్ర ప్రగతికి కంకణబద్ధులై ముందుకు సాగాలని ఎమ్మెల్యే విజ్ఞప్తి చేశారు.

B SHETTAIAH GOUD, LB NAGAR

B SHETTAIAH GOUD, LB NAGAR

Next Story