Kukatpally: కూకట్‌పల్లి ఆర్‌టీఏ కార్యాలయంలో ప్రొఫెసర్ జయశంకర్ జయంతి!

Kukatpally: కూకట్‌పల్లి ఆర్‌టీఏ కార్యాలయంలో ప్రొఫెసర్ జయశంకర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు.

Maruthisagar, Kukatpally
Published on: 6 Aug 2026 5:54 PM IST
Kukatpally
X

Kukatpally: కూకట్‌పల్లి ఆర్‌టీఏ కార్యాలయంలో ప్రొఫెసర్ జయశంకర్ జయంతి!

Kukatpally: ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ జయంతి సందర్భంగా కూకట్‌పల్లి ఆర్‌టీఏ కార్యాలయంలో గురువారం ఆయన చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్ శీను బాబు మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి ప్రొఫెసర్ జయశంకర్ చేసిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. తెలంగాణ ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన మహనీయుల్లో ఆయన ఒకరని పేర్కొన్నారు.

జీవితాంతం తెలంగాణ ప్రజల హక్కుల సాధన కోసం ఆయన చేసిన కృషి, నిబద్ధత, సిద్ధాంతాలు నేటి తరానికి ఆదర్శమని అన్నారు. ఆయన ఆశయాలను ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకుని సమాజాభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో రవాణా శాఖ అధికారులు, సిబ్బంది పాల్గొని ప్రొఫెసర్ జయశంకర్ చిత్రపటానికి పూలమాలలు వేసి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు.

Maruthisagar, Kukatpally

Maruthisagar, Kukatpally

Next Story