Jubileehills: శ్రీ రేణుక ఎల్లమ్మ దేవాలయ ముఖద్వారం ప్రారంభం!

Jubileehills: ఏజీ కాలనీ డివిజన్ పరిధిలో శ్రీ రేణుక ఎల్లమ్మ ఆలయ నూతన ముఖద్వారాన్ని హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే నవీన్ ప్రారంభించారు.

RAJESH,	WEST ZONE
Published on: 9 Aug 2026 9:56 AM IST
Jubileehills
X

Jubileehills: శ్రీ రేణుక ఎల్లమ్మ దేవాలయ ముఖద్వారం ప్రారంభం!

Jubileehills: నేడు జూబ్లీహిల్స్ నియోజకవర్గం A.G. కాలనీ డివిజన్ పరిధిలోని యాదగిరి నగర్, జై భవాని నగర్‌లో శ్రీ శ్రీ శ్రీ రేణుక ఎల్లమ్మ దేవాలయానికి నూతనంగా నిర్మించిన ముఖద్వారం (కమాన్) ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.జూబ్లీహిల్స్ శాసనసభ్యులు శ్రీ వి. నవీన్ యాదవ్ గారి ఆధ్వర్యంలో అద్భుతంగా నిర్మించిన ఈ దేవాలయ ముఖద్వారం (కమాన్‌)ను హైదరాబాద్ ఇన్‌చార్జ్ మంత్రి శ్రీ పొన్నం ప్రభాకర్ గారు ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు.

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి ఆశీస్సులు ప్రజలందరిపై ఎల్లప్పుడూ ఉండాలని, నియోజకవర్గ ప్రజలు సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో జీవించాలని ఆకాంక్షించారు.భక్తులకు ఆధ్యాత్మిక వాతావరణం కల్పించడంతో పాటు, దేవాలయాల అభివృద్ధికి తన వంతు సహకారం ఎల్లప్పుడూ అందిస్తానని ఎమ్మెల్యే తెలిపారు.

ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

RAJESH,	WEST ZONE

RAJESH, WEST ZONE

Next Story