Dundigal: మైనారిటీ రెసిడెన్షియల్ హాస్టల్లో దారుణం.. పోక్సో కేసు నమోదు!
Dundigal: లంగాణ స్టేట్ మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్ హాస్టల్లో మైనర్ విద్యార్థులపై జరిగిన లైంగిక దాడి ఘటనపై పోలీసులు పోక్సో (POCSO) చట్టం కింద కేసు నమోదు చేశారు.
Dundigal: మైనారిటీ రెసిడెన్షియల్ హాస్టల్లో దారుణం.. పోక్సో కేసు నమోదు!
దుండిగల్: బోరంపేటలోని తెలంగాణ స్టేట్ మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్ హాస్టల్లో దారుణం చోటుచేసుకుంది. అదే హాస్టల్లో చదువుతున్న ఇద్దరు మైనర్ విద్యార్థులపై ముగ్గురు మైనర్ విద్యార్థులు లైంగిక దాడికి పాల్పడినట్లు దుండిగల్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది.
బాధితులు శనివారం ఇంటికి వెళ్లిన తర్వాత ఈ విషయాన్ని తమ తల్లిదండ్రులకు తెలపడంతో, ఆగస్టు 3న బాధితుడి తండ్రి దుండిగల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు పోక్సో (POCSO) చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు వేగవంతం చేశారు.
Next Story




