Pocharam: పోచారం సద్భావన టౌన్‌షిప్‌లో వ్యభిచార గృహంపై దాడి!

Pocharam: పోచారం ఐటీ కారిడార్ పోలీస్ స్టేషన్ పరిధిలో గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్న వ్యభిచార కేంద్రం గుట్టురట్టు. నిర్వాహకులతో పాటు విటుల అరెస్ట్.

KARUNAKAR, UPPAL
Published on: 12 July 2026 11:25 AM IST
Pocharam
X

Pocharam: పోచారం సద్భావన టౌన్‌షిప్‌లో వ్యభిచార గృహంపై దాడి!

Pocharam: మల్కాజిగిరి పోలీస్ కమిషనరేట్ పరిధిలోని పోచారం ఐటీ కారిడార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పోచారం సద్భావన టౌన్‌షిప్‌లో నిర్వహిస్తున్న వ్యభిచార గృహంపై పోలీసులు ఆకస్మికంగా దాడి నిర్వహించారు. ఈ దాడిలో నిర్వాహకురాలు సహా ఐదుగురిని అరెస్ట్ చేయగా, 17 సంవత్సరాల 9 నెలల వయస్సు గల ఓ బాలుడిని జువెనైల్ న్యాయ చట్టం ప్రకారం అదుపులోకి తీసుకున్నారు.

బాధిత మహిళను రక్షించి సంబంధిత అధికారుల సంరక్షణకు అప్పగించారు. పోలీసుల వివరాల ప్రకారం, సద్భావన టౌన్‌షిప్‌లోని ఐదో అంతస్తులో ఉన్న ఓ ఫ్లాట్‌లో వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం అందడంతో ప్రత్యేక బృందం ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించింది. ఫ్లాట్‌లో ఇద్దరు మహిళలు, ఐదుగురు పురుషులు ఉన్నట్లు గుర్తించారు. గదిని తనిఖీ చేయగా ఉపయోగించిన కండోమ్‌లు, ఉపయోగించని కండోమ్ ప్యాకెట్లు లభించడంతో వాటిని స్వాధీనం చేసుకుని పంచనామా నిర్వహించారు.

ప్రాథమిక విచారణలో జర్పుల మణి (30), చాగంటి జితేంద్ర రెడ్డి (21)తో కలిసి ఐదు నెలల క్రితం ఫ్లాట్‌ను అద్దెకు తీసుకుని వ్యభిచార కేంద్రాన్ని నిర్వహిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. కస్టమర్లకు వాట్సాప్ ద్వారా మహిళల ఫొటోలు పంపించి, యూపీఐ ద్వారా నగదు స్వీకరిస్తున్నట్లు విచారణలో వెల్లడైంది.

జూలై 11న రూ.1,500 చెల్లించి బాధిత మహిళతో లైంగిక సేవలు పొందేందుకు వచ్చిన కస్టమర్లను పోలీసులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నట్లు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. స్వాధీనం చేసుకున్న వస్తువులను సీజ్ చేసి, నిందితులను న్యాయస్థానం ముందు హాజరుపరిచేందుకు చర్యలు చేపట్టినట్లు పోలీసులు వెల్లడించారు.

KARUNAKAR, UPPAL

KARUNAKAR, UPPAL

Next Story