LB Nagar: మోదీ సభే టార్గెట్.. ఎల్బీనగర్ కార్యకర్తలకు ఈటల రాజేందర్ దిశానిర్దేశం!

LB Nagar: మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ ఎల్బీనగర్‌లో మోదీ సభ సన్నాహక సమావేశంలో పాల్గొన్నారు.

B SHETTAIAH GOUD, LB NAGAR
Published on: 2 May 2026 1:47 PM IST
LB Nagar
X

LB Nagar: మోదీ సభే టార్గెట్.. ఎల్బీనగర్ కార్యకర్తలకు ఈటల రాజేందర్ దిశానిర్దేశం!

ఎల్బీనగర్: మోదీ సభ తెలంగాణలో బీజేపీని అధికారంలోకి తెచ్చేందుకు స్పూర్తి ఇచ్చే సభ : ఈటల రాజేందర్. ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారి సభ సన్నాహక సమావేశాల సందర్భంగా ఎల్బీనగర్ నియోజకవర్గ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న మల్కాజిగిరి పార్లమెంటు సభ్యులు ఈటల రాజేందర్.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..

- భారతీయ జనతా పార్టీ అత్యంత ప్రజాస్వామికమైన పార్టీ.

- నిరంతరం ప్రవహించే సజీవ నది లాంటిది.

- ప్రాంతీయ పార్టీలలో జీవితకాలం కుటుంబ సభ్యులు అధ్యక్షులుగా ఉంటారు.

- బిజెపిలో రెండు దఫాలు మాత్రమే అధ్యక్షులుగా చేయగలుగుతారు.

- బీజేపీ వారసత్వ పార్టీ కాదు. అన్ని వర్గాలకు ప్రాతినిధ్యం కల్పించే గొప్ప పార్టీ.

- బిజెపి కార్యకర్తలు అత్యంత కమిట్మెంట్ కలిగిన వారు.

- ప్రపంచానికి ఒకప్పుడు జ్ఞానాన్ని అందించిన దేశం భారత్.. మళ్లీ అలాంటి అగ్రస్థానం నిలబెట్టేందుకు నరేంద్ర మోడీ గారు ప్రయత్నం చేస్తున్నారు.

- నా బాధ ఒక్కటే.. దేశంలో రెండు ఎంపీలు గెలిస్తే ఒకటి గుజరాత్ నుంచి రెండవది హనుమకొండ నుంచి. కానీ గుజరాత్లో 27 ఏళ్లు అయిన తర్వాత కూడా మళ్లీ బిజెపికి పట్టం కడుతుంటే.. తెలంగాణలో ఎక్కడున్నం అనే బాధ కలుగుతుంది. ఎందుకు అధికారంలోకి రాలేక పోతున్నాం అనే బాధ ఉంది.

- నరేంద్ర మోడీ గారు చెక్కుచెదరని అచంచల విశ్వాసంతో కూడిన పరిపాలన దేశంలో అందిస్తున్నారు.

- ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన రాజకీయ నాయకుడు నరేంద్ర మోడీ అని కీర్తి దక్కింది. ప్రపంచంలో ఎక్కువ మంది ప్రేమ పొందిన నేత.

- బెంగాల్ గడ్డమీద కాషాయ జెండా ఎగురవేయబోతున్నాం అని సర్వేలు చెప్తున్నాయి.

- వేరే రాష్ట్రాల్లో గెలిచినప్పుడు సీట్లు పంచుకొని సంబరాలు చేసుకుంటున్నాం.. మన దగ్గర కూడా స్వీట్లు పంచుకొనే రోజు రావాలి.

- 4 లక్షల మెజారిటీతో బిజెపిని గెలిపించుకుని మల్కాజ్గిరి పార్లమెంటు నియోజకవర్గం అజయమైన శక్తిగా నిలిచింది. అందులో అత్యధిక మెజారిటీ ఇచ్చింది ఎల్బీనగర్ అసెంబ్లీ నియోజకవర్గం. పోలైన ఓట్లలో 65% ఓటు సాధించడం చాలా అరుదైన విషయం. 1 లక్ష 6 వేల మెజారిటీ ఇచ్చింది ఎల్బీనగర్.

- గత జిహెచ్ఎంసి ఎన్నికల్లో అత్యధిక కార్పొరేటర్ల సీట్లు గెలిపించింది కూడా ఎల్బీనగర్ నియోజకవర్గం.

- మార్పుకు బాటలు వేసే నియోజకవర్గం.

- నరేంద్ర మోడీ గారి మీటింగ్ కి ప్రజలందరినీ కదిలించండి.

- మూడోసారి ప్రధానమంత్రి అయిన తర్వాత తొలిసారిగా నరేంద్ర మోడీ గారు రాష్ట్రానికి వస్తున్నారు.

- గుజరాత్ మహారాష్ట్ర లాగా తెలంగాణ కూడా అభివృద్ధి చెందాలంటే సంపూర్ణ మద్దతు ఇవ్వమని అడగడానికి వస్తున్నారు.

- మూసి, హైడ్రా ఉద్యమం ఏదైనా నాయకత్వం వహించింది భారతీయ జనతా పార్టీనే.

- మనం హక్కుదారులం.

- రాజకీయ నాయకుడికి విఐపి ప్రజలు మాత్రమే.

- నాయకులు ప్రజలను ప్రేమించాలి. సమస్యలు వినాలి, పరిష్కరించాలి.. పరిష్కారం కోసం మార్గం అన్వేషించ కలిగిన వారు మాత్రమే నాయకులు.

- రాజకీయాలలో తొలగి తోవ ఎవరు ఇవ్వరు తోసుకొని పోవాల్సిందే.

- ఎల్బీనగర్ నియోజకవర్గంలో శక్తివంతమైన లీడర్షిప్ ఉంది.

- రక్తసంబంధం కంటే పార్టీ సంబంధం చాలా గొప్పది, బలమైనది.

- మోడీగారి మీటింగ్ కోసం నిన్న 8 మీటింగ్స్ పెట్టిన.. అందరూ పెద్ద ఎత్తున తరలివస్తామని చెప్పారు.

- గత ఎన్నికల్లో దక్షిణ భారతదేశంలో ఎన్నికల ప్రచారం మొదలుపెట్టింది మల్కాజ్గిరి పార్లమెంటు నియోజకవర్గం నుంచి.. ప్రజల ప్రేమను చూసి అనేక మీటింగ్లో మోదీ గారు మన గురించి చెప్పారు. మళ్ళీ ఇప్పుడు మల్కాజిగిరికే వస్తున్నారు.

- మీ మీద నమ్మకంతో మీ తరపున మాట ఇచ్చిన.. మాట నిలబెట్టే బాధ్యత తీసుకోండి.

- తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావడానికి బాటలు వేసే.. స్ఫూర్తినిచ్చే సభ ఇది పెద్ద ఎత్తున తరలివచ్చి విజయవంతం చేయండి.

ఈ హాల్ ఇచ్చినందుకు సురేందర్ అరుణ యాదవులక, ఆకలి తీర్చిన దాత జీవన్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు.

ఈ సమావేశంలో రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి, జిల్లా మాజీ అధ్యక్షులు సామ రంగారెడ్డి, రాష్ట్ర నాయకు గౌతమ్ రావు, ఆలె భాస్కర్, కాసం వెంకటేశ్వర్లు, శైలజ, శ్రీదేవి, చెన్నకేశవరెడ్డి, యశ్పాల్ గౌడ్, భాస్కర్, శ్యామ్, గౌరవ కార్పొరేటర్లు పవన్, అరుణ, నరసింహారెడ్డి, జీవన్ రెడ్డి, నరసింహ గుప్తా. గీత, శంకర్, రాజేంద్రప్రసాద్, నగేష్, నరేష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

B SHETTAIAH GOUD, LB NAGAR

B SHETTAIAH GOUD, LB NAGAR

Next Story