Quthbullapur: ఫెన్సింగ్ తొలగించిన కబ్జాదారులపై కేసు పెట్టాలి ఆకులు సతీష్

Quthbullapur: పేట్ బషీరాబాద్ సర్వే 23లో ప్రభుత్వ భూమి ఫెన్సింగ్ తొలగింపు. ఆక్రమణదారులపై క్రిమినల్ కేసులు పెట్టాలని ప్రజావాణిలో అడిషనల్ కలెక్టర్‌కు ఫిర్యాదు.

BOMMA SRIDHAR, QUTHBULLAPUR
Published on: 3 Aug 2026 7:50 PM IST
Quthbullapur
X

Quthbullapur: ఫెన్సింగ్ తొలగించిన కబ్జాదారులపై కేసు పెట్టాలి ఆకులు సతీష్

క్కుతాబుల్లాపూర్: సర్వే నెంబర్ 23 పేట్ బషీర్ బాద్ లో విలువైన రెండు ఎకరాల స్థలానికి రెవెన్యూ అధికారులు జూన్ నెలలో ఫెన్సింగ్ వేస్తే ఫెన్సింగ్ ని తొలగించి కబ్జా చేయడానికి ప్రయత్నించిన వారిపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని మరియు ప్రభుత్వ భూమికి మళ్లీ ఫెన్సింగ్ వేసి రక్షించి ప్రజా అవసరాలకు కేటాయించాలని ప్రజావాణిలో అడిషనల్ కలెక్టర్ కి ఫిర్యాదు చేయడమైనది.

ఈ ప్రభుత్వ భూమిని గతంలో కేటాయించిన విధంగా డీసీపీ కార్యాలయానికి వాడుకునే విధంగా చూడాలని లేనియెడల ప్రజా అవసరాల కోసం కేటాయించి కాపాడాలని ఈ సందర్భంగా ఆకులు సతీష్ కోరారు.

ఈరోజు కుత్బుల్లాపూర్ అధికారులు ప్రభుత్వ భూమిని ప్రైవేటు బిల్డర్ వాడుకోకుండా కందకాలు తవ్వడం జరిగింది. ఇప్పటివరకు పోలీసులకి ఫిర్యాదు చేయనట్టు సమాచారం, తక్షణమే ఫెన్సింగ్ మరియు బోర్డు తొలగించి కబ్జాకు ప్రయత్నించిన వారిపై క్రిమినల్ కేసు నమోదు చేయండి అని కోరారు.

BOMMA SRIDHAR, QUTHBULLAPUR

BOMMA SRIDHAR, QUTHBULLAPUR

Next Story