Jawaharnagar: జవహర్‌నగర్‌లో ఘనంగా పవన్ కళ్యాణ్ 55వ జన్మదిన వేడుకలు!

Jawaharnagar: జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 55వ జన్మదిన వేడుకలు జవహర్‌నగర్‌లో ఘనంగా నిర్వహణ. నరేందర్ యాదవ్ ఆధ్వర్యంలో కేక్ కటింగ్, ర్యాలీ.

PURENDAR, ALWAL
Published on: 2 Sept 2026 3:27 PM IST
Jawaharnagar
X

Jawaharnagar: జవహర్‌నగర్‌లో ఘనంగా పవన్ కళ్యాణ్ 55వ జన్మదిన వేడుకలు!

Jawaharnagar: మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ కీసర సర్కిల్ జవహర్ నగర్ డివిజన్,చంద్రపురి కాలనీ డివిజన్ జనసేన పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ 55వ జన్మదిన వేడుకలను జవహర్‌నగర్‌లో జనసేన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఘనంగా నిర్వహించారు.

జనసేన నాయకుడు నరేందర్ యాదవ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకలకు జనసేన నాయకులు, కార్యకర్తలు, పవన్ కళ్యాణ్ అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి పవన్ కళ్యాణ్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

అనంతరం అభిమానులు, కార్యకర్తలు ఉత్సాహంగా ర్యాలీ నిర్వహించారు. పవన్ కళ్యాణ్ ఆశయాలు, జనసేన పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి మరింత విస్తృతంగా తీసుకెళ్లేందుకు ప్రతి కార్యకర్త కృషి చేయాలని నాయకులు పిలుపునిచ్చారు.

పుట్టినరోజు వేడుకలను కేవలం సంబరాలకే పరిమితం చేయకుండా ప్రజాసేవకు అంకితం కావాలని కార్యకర్తలకు సూచించారు. పేదలు, బలహీన వర్గాలు, అవసరంలో ఉన్న ప్రజలకు అండగా నిలిచి ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని అన్నారు. పవన్ కళ్యాణ్‌కు సంపూర్ణ ఆయురారోగ్యాలు, మరిన్ని విజయాలు కలగాలని ఈ సందర్భంగా జనసేన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఆకాంక్షించారు.

PURENDAR, ALWAL

PURENDAR, ALWAL

Next Story