Medchal: టీకాల కోసం వెళ్తే తలుపులు మూసి ఉన్నాయి మేడ్చల్ హెల్త్ సెంటర్
Medchal: మేడ్చల్ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సిబ్బంది నిర్లక్ష్యం. 10 గంటలైనా తెరవని ఆసుపత్రి తలుపులు.
Medchal: టీకాల కోసం వెళ్తే తలుపులు మూసి ఉన్నాయి మేడ్చల్ హెల్త్ సెంటర్
మేడ్చల్: ఉదయం 9 గంటలకే తెరవాల్సిన కేంద్రం పది గంటలు దాటినా తెరుచుకోకపోవడంతో వైద్యం కోసం వచ్చిన రోగులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. బుధవారం కావడంతో చిన్నారులకు టీకాలు వేయించేందుకు తల్లిదండ్రులు ఒక్కరొక్కరుగా ఆస్పత్రికి చేరుకున్నారు. అయితే ఆస్పత్రి తలుపులు మూసే ఉండటంతో చిన్నారులను ఎత్తుకుని బయటే వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది.
గంటల తరబడి పడిగాపులు కాస్తున్న రోగులు, వైద్య సిబ్బంది… కానీ పరిస్థితిని పట్టించుకునే అధికారులు మాత్రం కనిపించలేదు. సమయానికి వైద్య సేవలు అందక ప్రజలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఇలాంటి నిర్లక్ష్యం పునరావృతం కాకుండా ఉన్నతాధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
Next Story




