Shankar Nagar: ఆకతాయిల చేష్టేనా రాత్రికి రాత్రే కాలిబూడిదైన కారు!

Shankar Nagar: హయత్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని శంకర్‌నగర్‌లో ఇంటి ముందు పార్క్ చేసిన మాధవరెడ్డి కారు మంటల్లో పూర్తిగా దగ్ధమైంది.

AJAY, HAYATH NAGAR
Published on: 10 Aug 2026 12:37 PM IST
Shankar Nagar
X

Shankar Nagar: ఆకతాయిల చేష్టేనా రాత్రికి రాత్రే కాలిబూడిదైన కారు!

Shankar Nagar: హయత్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని శంకర్‌నగర్‌లో కారు దగ్ధమైన ఘటన కలకలం రేపింది. శంకర్‌నగర్‌లో ఇంటి ముందు పార్కింగ్ చేసిన కారులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి.

మంటల్లో మాధవ రెడ్డికి చెందిన కారు పూర్తిగా కాలిపోయింది.కారును ఎవరో ఆకతాయిలు కావాలనే తగలబెట్టి ఉంటారని కారు యజమాని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు.

కారు దగ్ధమైన తీరుపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సమీపంలోని సీసీ కెమెరాల దృశ్యాలను పరిశీలిస్తూ, మంటలు ఎలా చెలరేగాయి, ఘటనకు ఎవరైనా కారణమా అనే కోణంలో విచారణ చేస్తున్నారు.

ఈ ఘటనతో శంకర్‌నగర్‌లో స్థానికులు ఆందోళనకు గురయ్యారు.

AJAY, HAYATH NAGAR

AJAY, HAYATH NAGAR

Next Story