Parigi: కల్యాణ లక్ష్మి లంచం కేసులో ఏసీబీకి చిక్కిన జీపీఓ
Parigi: పరిగి నియోజకవర్గం దోమ మండలం మోత్కూర్లో కల్యాణ లక్ష్మి ఫైల్ కోసం రూ.6 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్గా పట్టుబడిన జీపీఓ జగదీశ్.
Parigi: కల్యాణ లక్ష్మి లంచం కేసులో ఏసీబీకి చిక్కిన జీపీఓ
పరిగి: దోమ మండలం మోత్కూర్ గ్రామానికి చెందిన జీపీఓ జగదీశ్, కళ్యాణ లక్ష్మి పథకం కోసం దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారుడి నుంచి ఫైల్ ముందుకు కదిలించేందుకు రూ.6 వేల లంచం డిమాండ్ చేసినట్లు సమాచారం.
లంచం ఇవ్వడానికి నిరాకరించిన బాధితులు అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులను ఆశ్రయించారు. బాధితుల ఫిర్యాదు మేరకు పక్కా ప్రణాళికతో రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు, జగదీశ్ లంచం తీసుకుంటున్న సమయంలో రెడ్ హ్యాండెడ్గా పట్టుకుని అదుపులోకి తీసుకున్నారు.
ఈ ఘటనతో ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలులో చోటు చేసుకుంటున్న అవినీతి మరోసారి వెలుగులోకి వచ్చింది. పేదల కోసం ఉద్దేశించిన పథకాలను కొందరు అధికారులు ఆదాయ మార్గంగా మార్చుకోవడం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది.
ప్రజల సంక్షేమానికి అడ్డంకిగా మారుతున్న ఇలాంటి అవినీతి అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు, బాధితులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.




