Pargi: పరిగి సరస్వతీ శిశుమందిర్‌లో ఘనంగా సామూహిక వరలక్ష్మీ వ్రతం!

Pargi: పరిగి శ్రీ సరస్వతీ శిశుమందిర్ హైస్కూల్‌లో భక్తిశ్రద్ధలతో సామూహిక వరలక్ష్మీ వ్రతం. మహిళలు, ఉపాధ్యాయులు మరియు తల్లిదండ్రుల ప్రత్యేక పూజలు.

WAZID, PARIGI
Published on: 21 Aug 2026 5:12 PM IST
Pargi
X

Pargi: పరిగి సరస్వతీ శిశుమందిర్‌లో ఘనంగా సామూహిక వరలక్ష్మీ వ్రతం!

Pargi: పరిగిలోని శ్రీ సరస్వతీ శిశుమందిర్ ఉన్నత పాఠశాలలో సామూహిక వరలక్ష్మీ వ్రత కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. మహిళలు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, పాఠశాల కమిటీ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

పాఠశాల అధ్యక్షులు శ్రీ రాచూరి శ్రీనివాస్ రెడ్డి దీప ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి శ్రీ ఆర్. వెంకట్రాములు, పాఠశాల ప్రధానాచార్యులు శ్రీ కె. మల్లేష్, పాఠశాల కమిటీ సభ్యులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, పూర్వ విద్యార్థులు, శ్రేయోభిలాషులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

వరలక్ష్మీ అమ్మవారికి ప్రత్యేక పూజలు, అర్చనలు నిర్వహించడంతో పాటు లక్ష్మీ అష్టోత్తర శతనామావళి, శ్లోక పఠనం తదితర కార్యక్రమాలను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.

కార్యక్రమ వక్తగా పాల్గొన్న తెలుగు పండిట్ శ్రీ వి. వీరానందం వరలక్ష్మీ వ్రతం యొక్క విశిష్టత, ఆధ్యాత్మిక ప్రాధాన్యతను వివరించారు. వరలక్ష్మీ అమ్మవారి అనుగ్రహంతో ప్రతి కుటుంబంలో సుఖశాంతులు, సౌభాగ్యం, ఐశ్వర్యం కలుగుతాయని, మన సంప్రదాయాలను భక్తిశ్రద్ధలతో కొనసాగించాలని సూచించారు.

సామూహికంగా వరలక్ష్మీ వ్రతాన్ని నిర్వహించడం ద్వారా భక్తి, సంస్కృతి, సంప్రదాయాలతో పాటు సమాజంలో ఐక్యతా భావం, ఆధ్యాత్మిక చైతన్యం పెంపొందుతాయని నిర్వాహకులు తెలిపారు.

WAZID, PARIGI

WAZID, PARIGI

Next Story