Pargi: కాంగ్రెస్ 1000 రోజుల పాలన వేళ ఎమ్మెల్యే ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ

Pargi: కాంగ్రెస్ 1000 రోజుల ప్రజా పాలనపై పరిగిలో ఎమ్మెల్యే డా. టి. రామ్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ. రూ.300 కోట్ల రుణమాఫీ, ఇందిరమ్మ ఇళ్ల ప్రగతి వెల్లడి.

WAZID, PARIGI
Published on: 4 Sept 2026 4:56 PM IST
Pargi
X

Pargi: కాంగ్రెస్ 1000 రోజుల పాలన వేళ ఎమ్మెల్యే ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ

పరిగి: కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి వెయ్యి రోజుల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా పరిగి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ బైక్‌ ర్యాలీ నిర్వహించారు. ఎమ్మెల్యే డా. టి. రామ్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ ర్యాలీలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో పేదలు, రైతులు, మహిళలు, యువత, మైనారిటీలు, బడుగు బలహీన వర్గాల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తూ ప్రజా పాలన కొనసాగిస్తోందని ఎమ్మెల్యే తెలిపారు.పరిగి నియోజకవర్గంలో ఇప్పటికే 3,500 ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం పూర్తయిందని, మరో 2,500 ఇళ్లు మంజూరయ్యాయని చెప్పారు. మొత్తంగా 6 వేల ఇళ్ల ద్వారా పేద కుటుంబాల సొంతింటి కలను సాకారం చేస్తున్నామని పేర్కొన్నారు.

రైతులకు ఇచ్చిన హామీ మేరకు రూ.2 లక్షల వరకు రుణమాఫీ అమలు చేసి, పరిగి నియోజకవర్గ రైతులకు సుమారు రూ.300 కోట్ల రుణమాఫీ జరిగిందని ఎమ్మెల్యే వెల్లడించారు.అదేవిధంగా రేషన్ కార్డుల ద్వారా పేద కుటుంబాలకు నాణ్యమైన సన్నబియ్యం అందించడం, అర్హులైన వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, అనారోగ్యంతో బాధపడుతున్న పేదలకు పెన్షన్లు అందించే కార్యక్రమాలను ప్రభుత్వం చేపట్టిందని తెలిపారు. పరిగి ప్రజలు తనపై ఉంచిన నమ్మకాన్ని ఎప్పటికీ వమ్ము చేయబోనని ఎమ్మెల్యే డా. టి. రామ్మోహన్ రెడ్డి స్పష్టం చేశారు.

WAZID, PARIGI

WAZID, PARIGI

Next Story