Pargi: రేడియల్ రోడ్డు బాధితులకు ₹16.22 కోట్ల పరిహారం ఎమ్మెల్యే

Pargi: రేడియల్ రోడ్డు నిర్మాణంలో భూములు కోల్పోయిన రైతులకు రూ. 16.22 కోట్ల నష్టపరిహార చెక్కులు పంపిణీ చేసిన పరిగి ఎమ్మెల్యే డాక్టర్ టి. రామ్మోహన్ రెడ్డి.

WAZID, PARIGI
Published on: 29 July 2026 2:01 PM IST
Pargi
X

Pargi: రేడియల్ రోడ్డు బాధితులకు ₹16.22 కోట్ల పరిహారం ఎమ్మెల్యే

పరిగి: వికారాబాద్ జిల్లా పరిగిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో రేడియల్ రోడ్డు నిర్మాణంలో భూములు కోల్పోతున్న రైతులకు నష్టపరిహార చెక్కులను ఎమ్మెల్యే డాక్టర్ టి. రామ్మోహన్ రెడ్డి, ఆర్డీవో విశ్వనాథంతో కలిసి పంపిణీ చేశారు.

అల్లాపూర్, గూడూరు, దొంగ ఎంకేపల్లి గ్రామాలకు చెందిన రైతుల 66 ఎకరాల భూమికి గాను మొత్తం రూ.16 కోట్ల 22 లక్షల 78 వేల నష్టపరిహారాన్ని ప్రభుత్వం అందజేసింది.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అభివృద్ధి కార్యక్రమాల కోసం భూములు కోల్పోతున్న రైతులకు ఎలాంటి అన్యాయం జరగకుండా మార్కెట్ విలువ ప్రకారం పూర్తి నష్టపరిహారం అందిస్తున్నామని తెలిపారు. రాష్ట్ర అభివృద్ధితో పాటు రైతుల సంక్షేమానికి కూడా ప్రభుత్వం సమాన ప్రాధాన్యత ఇస్తోందన్నారు.

ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణలో అభివృద్ధి వేగంగా జరుగుతోందని పేర్కొన్న ఎమ్మెల్యే... పరిగి–వికారాబాద్ జాతీయ రహదారి, పరిగి–షాద్‌నగర్ రహదారి విస్తరణ, రేడియల్ రోడ్డు, రీజినల్ రింగ్ రోడ్డు (RRR), కె.పి. లక్ష్మీదేవిపల్లి సాగునీటి ప్రాజెక్టు వంటి కీలక పనులు వేగంగా కొనసాగుతున్నాయని చెప్పారు.

ఈ ప్రాజెక్టులు పూర్తయితే పరిగి ప్రాంతంలో రవాణా, వ్యవసాయం, పారిశ్రామిక రంగాలకు ఊతమివ్వడంతో పాటు యువతకు పెద్దఎత్తున ఉపాధి అవకాశాలు లభిస్తాయని ఎమ్మెల్యే వివరించారు. నష్టపరిహారం అందుకున్న రైతులు రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే డాక్టర్ టి. రామ్మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలుపుతూ, ప్రాంత అభివృద్ధికి తమ వంతు సహకారం అందిస్తామని పేర్కొన్నారు.

WAZID, PARIGI

WAZID, PARIGI

Next Story