Pargi: పరిగిలో చేపల వేటకు వెళ్లి చెరువులో మునిగి వ్యక్తి మృతి!
Pargi: వికారాబాద్ జిల్లా పరిగి మండలంలోని సుల్తాన్పూర్ సమీపంలో విషాదం చోటుచేసుకుంది.
Pargi: పరిగిలో చేపల వేటకు వెళ్లి చెరువులో మునిగి వ్యక్తి మృతి!
PARGI: వికారాబాద్ జిల్లా పరిగి మండలంలోని సుల్తాన్పూర్ సమీపంలో విషాద ఘటన చోటుచేసుకుంది. చేపల వేట కోసం చెరువుకు వెళ్లిన ఓ వ్యక్తి ప్రమాదవశాత్తు చెరువులో పడి మృతిచెందాడు.
స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం, అభిమాన్ అనే వ్యక్తి ఉదయం ఇంటి నుంచి బయలుదేరి సుల్తాన్పూర్ సమీపంలోని చెరువులో చేపల కోసం వల వేశాడు. అయితే చాలా సమయం గడిచినా ఆయన ఇంటికి తిరిగి రాలేదు.
ఇదిలా ఉండగా, చెరువు కట్టపై బట్టలు, చెప్పులు కనిపించగా అక్కడ మనిషి కనిపించకపోవడంతో అటుగా వెళ్తున్న స్థానికులకు అనుమానం వచ్చింది. వెంటనే ఈ విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలియజేశారు.
ఘటన స్థలానికి చేరుకున్న బంధువులు చెరువులో గాలింపు చేపట్టగా అభిమాన్ మృతదేహం నీటిలో కనిపించింది. దీంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు.
సమాచారం అందుకున్న 9వ వార్డు కౌన్సిలర్ అయ్యుబ్ అక్కడికి చేరుకొని పోలీసులకు,అంబులెన్స్ కు సమాచారం ఇచ్చారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పరిగి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.




