Pargi: శివారెడ్డిపల్లిలో 100% పూర్తయిన SIR ప్రక్రియ

Pargi: పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి స్వగ్రామం శివారెడ్డిపల్లిలో 100 శాతం పూర్తయిన SIR ప్రక్రియ. BLOలు, BLAలను ఎమ్మెల్యే సన్మానించనున్నట్లు వెల్లడి.

WAZID, PARIGI
Published on: 28 July 2026 8:45 PM IST
Pargi
X

Pargi: శివారెడ్డిపల్లిలో 100% పూర్తయిన SIR ప్రక్రియ

పరిగి: వికారాబాద్ జిల్లా పరిగి నియోజకవర్గం దోమ మండలం శివారెడ్డిపల్లి గ్రామంలో చేపట్టిన SIR (Special Intensive Revision) ప్రక్రియను నేటితో 100 శాతం పూర్తి చేశారు. పరిగి ఎమ్మెల్యే డాక్టర్ టి. రామ్మోహన్ రెడ్డి స్వగ్రామంలో ఈ కార్యక్రమం విజయవంతంగా పూర్తికావడం పట్ల నిర్వాహకులు సంతోషం వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి సహకరించిన ప్రతి ఒక్కరికీ నిర్వాహకులు పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో సూపర్వైజర్ సరిత, గ్రామ సర్పంచ్ గుడాటి లక్ష్మమ్మ, దోమ మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు మరియు BLA గుడాటి శ్రీకాంత్ రెడ్డి, BLO మోహన్, BLO శ్వేత, BLA చెన్నయ్య, ఫీల్డ్ అసిస్టెంట్ లక్ష్మీనారాయణ గౌడ్, మాజీ సర్పంచ్ పీ. కిష్టయ్యతో పాటు పలువురు నాయకులు, సిబ్బంది పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

త్వరలో SIR ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేసిన BLAలు, BLOలకు పరిగి ఎమ్మెల్యే డాక్టర్ టి. రామ్మోహన్ రెడ్డి చేతుల మీదుగా సన్మాన కార్యక్రమం నిర్వహించనున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు.

WAZID, PARIGI

WAZID, PARIGI

Next Story